శ్రీరెడ్డితో తేల్చుకోవడానికి విశాల్ రెడీ

శ్రీరెడ్డితో తేల్చుకోవడానికి  విశాల్ రెడీ

ఎటువంటి ఆధారాలు చూపకుండా ఇండస్ట్రీలోని జనాలపై ఆరోపణలు చేస్తూ ఎఫ్పటికప్పుడు వాయిస్ రెయిజ్ చేస్తూనే ఉంది నటి శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ పై పోరాటమంటూ వెలుగులోకి వచ్చిన ఆమె తనను మోసం చేశారంటూ ఇప్పటికే టాలీవుడ్ లో చాలామందిపై చాలారకాల ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభానికి ముందు నాచురల్ స్టార్ నానిపట్ల చాలా దారుణమైన కామెంట్లే చేసింది.

ఇంతవరకు టాలీవుడ్ జనాలనే టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. తమిళంలో నటి ఖుష్బూ భర్త.. డైరెక్టర్ సుందర్ సి.. నటుడు రాఘవ లారెన్స్.. ఎ.ఆర్.మురుగదాస్.. శ్రీకాంత్ త పేర్లు బయటపెట్టింది. వీళ్లంతా తనకు అవకాశాలిస్తానని మోసం చేసిన వారంటూ కామెంట్ చేసింది. టాలీవుడ్ శ్రీరెడ్డి విషయాన్ని పట్టించుకోనట్టు వదిలేసినా కోలీవుడ్ సీరియస్ గానే తీసుకున్నట్టుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో అన్నింటా ముందుండి నడిపిస్తున్న హీరో విశాల్ దీనిపై లీగల్ ఫైట్ కు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఆమెపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే దానిపై ఇప్పటికే మాట్లాడటం మొదలుపెట్టాడట.

నానిపై శ్రీరెడ్డి అసభ్యకరమైన కామెంట్స్ చేసినప్పుడే విశాల్ ఈ ఇష్యూపై స్పందించాడు. ఏమైనా ఆధారాలు ఉంటే చూపించి మాట్లాడాలని.. అదేమీ లేకుండా నోటికొచ్చిన పేరు చెప్పేస్తానంటే ఎలాగంటూ ప్రశ్నించాడు. దీనికి శ్రీరెడ్డి తనను టార్గెట్ చేస్తుందని కూడా చెప్పాడు. కానీ ఆమె అతడి పేరు చెప్పకుండా అతడు లీడ్ చేస్తున్న ఇండస్ట్రీపై ఆరోపణలతో దాడి మొదలెట్టింది. కోలీవుడ్ లో ఎన్నో సీరియస్ ఇష్యూలను సమర్ధంగా సాల్వ్ చేసిన విశాల్ శ్రీరెడ్డి ఇష్యూను ఎలా డీల్ చేయబోతున్నాడో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు