స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు సిద్ధు పంచ్

స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు సిద్ధు పంచ్

స్టార్ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో చేసే హంగామా కాదు. హీరోల కోసం పెయిడ్ క్యాంపైనింగ్ చేసేవాళ్లు ఇక్కడా పెద్ద ఎత్తునే ఉంటారు. ఇలాంటి బ్యాచ్‌లు ఈ మధ్య మరీ శ్రుతి మించి పోతున్నాయి. ఇంతకుముందు హీరోల పుట్టిన రోజులు వచ్చినపుడు మాత్రమే సోషల్ మీడియాలో హడావుడి చేసేవాళ్లు వీళ్లు. కానీ ఈ మధ్య మరీ టూమచ్‌గా 100 డేస్ టు బర్త్ డే.. 50 డేస్‌ టు బర్త్ డే అంటూ విచిత్రమైన క్యాంపైనింగ్‌లు నడుస్తున్నాయి. స్టార్ హీరోల వ్యక్తిగత పీఆర్వోలు వెనుక ఉండి ఇలాంటి క్యాంపైనింగ్స్ నడిపిస్తుంటారు. దీన్ని అభిమానం అనాలా.. వెర్రి అనాలా అర్థం కాని పరిస్థితి. ముందు కోలీవుడ్లో విజయ్, అజిత్ అభిమానులే ఇలాంటి అతి చేసేవాళ్లు. కానీ ఈ మధ్య మన జనాలకు కూడా ఈ పిచ్చి బాగానే ముదిరింది.

తాజాగా ప్రభాస్ పుట్టిన రోజుకు వంద రోజులుందంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఒక క్యాంపైన్ నడిపిస్తున్నారు. ఇందులో పీఆర్వోలు కూడా భాగస్వాములవుతున్నారు. ఒక తమిళ పీఆర్వో ఇలాగే ‘100 డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్ డే’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ చేశాడు. దీనికి తమిళ కథానాయకుడు సిద్దార్థ్ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. వచ్చే సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజుకు కూడా కౌంట్ డౌన్ పెట్టమంటూ.. ‘465 డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్ డే’ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించి ట్వీట్ చేశాడు. హ్యాష్ ట్యాగ్స్ అనేవి థ్రిల్ ఇవ్వాలి కానీ.. కిల్ చేయకూడదని.. కొంచెం విచక్షణ పాటించమని సిద్ధు తనదైన శైలిలో పంచ్ ఇచ్చాడు. సిద్ధు ట్వీట్ ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పిస్తే తెప్పించవచ్చు కాక.. మరీ విపరీత స్థాయికి చేరుతున్న హీరోల ఆరాధనకు బ్రేక్ వేయాలన్న సందేశం అతడి మాటల్లో ఉంది. ఈ స్థాయి అభిమానాన్ని ఆయా హీరోలైనా కోరుకుంటారా అన్నది డౌటు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English