శ్రీరెడ్డి పెద్ద దర్శకుడిని టార్గెట్ చేసింది

శ్రీరెడ్డి పెద్ద దర్శకుడిని టార్గెట్ చేసింది

టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించి ఎడతెరపి లేకుండా ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. కానీ ఆమె ఆరోపణల వల్ల పెద్దగా ఫలితం లేకపోయింది. ఒక దశలో ఆమె పోరాటం బాగానే నడుస్తున్నట్లుగా అనిపించింది కానీ.. పవన్ కళ్యాణ్‌ను బూతు తిట్టడంతో వ్యవహారం పక్కకు వెళ్లిపోయి ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. కొంచెం గ్యాప్ ఇచ్చిన నానిని టార్గెట్ చేసినా.. అతను రివర్సవడంతో శ్రీరెడ్డి వెనక్కి తగ్గక తప్పినట్లు లేదు. అలాగని ఆమె సైలైంటైపోలేదు. టాలీవుడ్‌ను వదిలేసి కోలీవుడ్ మీద పడింది. కోలీవుడ్ లీక్స్ అంటూ అక్కడి ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటే చెబుతోంది. ఆల్రెడీ మురుగదాస్, శ్రీకాంత్, లారెన్స్ లాంటి వాళ్లను ఆమె టార్గెట్ చేసింది. తాజాగా ఆమె ఒక పెద్ద దర్శకుడిపై ఆరోపణలు గుప్పించింది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. సుందర్.సి.

సుందర్ దర్శకత్వంలో పెద్ద హిట్టయిన ‘ఆరణ్మయి’ చిత్రీకరణ సందర్భంగా తనకు అతడి నుంచి లైంగిక వేధింపులు ఎదురైనట్లు చెబుతోంది శ్రీరెడ్డి. ఒకసారి సుందర్ అసిస్టెంట్ ఒకరు తనను హైదరాబాద్ లోని నోవాటెల్‌కు రావాల్సిందిగా చెప్పాడని.. వెళ్లాక తన తర్వాతి సినిమాలో కచ్చితంగా అవకాశం ఇస్తానని సుందర్ హామీ ఇచ్చాడని.. తనకు సెక్సువల్ కమిట్మెంట్ ఇవ్వాల్సిందిగా  అడిగాడని శ్రీరెడ్డి ఆరోపించింది. కానీ ఆ తర్వాత ఏమైందన్న విషయం ఆమె చెప్పలేదు. ‘బాహుబలి’ కెమెరామన్ సెంథిల్ కుమార్ పేరును కూడా శ్రీరెడ్డి ప్రస్తావించడం గమనార్హం. ఐతే వీళ్లిద్దరి విషయంలో స్పష్టమైన ఆరోపణలేమీ చేయలేదు శ్రీరెడ్డి. కోలీవుడ్లో మరిందరి బాగోతాల్ని బయటపెడతానని శ్రీరెడ్డి అంటోంది. ఐతే టాలీవుడ్లోనే ఆమె ఆరోపణలకు పెద్దగా స్పందన లేకపోయింది. మరి కోలీవుడ్ జనాలు ఏమాత్రం రెస్పాండవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు