అనుష్క అండ్ నాని.. వాటే కాంబినేషన్

అనుష్క అండ్ నాని.. వాటే కాంబినేషన్

అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది అంటే ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అయినా కావాలి లేకుంటే లేడీ ఓరియంటెడ్ మూవీ అయినా కావాలి. అనుష్క రేంజ్ ఇదే. బాహుబలి లాంటి ఘనవిజయం తరవాత అనుష్క భాగమతి సినిమా ఒక్కటే చేసింది. ఈ సినిమా తరవాత అనుష్క ఇంతవరకు ఏ సినిమాకూ ఓకే చెప్పలేదు. అంతకంటే ఆమెకు ఆఫర్లు రాలేదనడమే కరెక్ట్.

తాజాగా అనుష్కతో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ తీయడానికి డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ప్లాన్ చేస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి సినిమాలు కమర్షియల్ పెద్దగా హిట్ కాకపోయినా వైవిధ్యంగా ఉంటాయనే గుర్తింపు ఉంది. ఆయన అనుష్కను దృష్టిలో ఉంచుకునే ఓ సూపర్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ మూవీని తెలుగులో పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రేక్షకులకు ఇంకో సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ లో నాని కనిపించబోతున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ లో ఓ సినిమా చేయడానికి నాని ఎప్పుడో మాటిచ్చాడు. ఇప్పుడు చంద్రశేఖర్ యేలేటి సినిమా కోసం ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్ రావడంతో  కాదనకుండా ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. ఈ సినిమాగనుక పట్టాలెక్కితే నాని స్టార్ హోదా దక్కించుకున్నాక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటించడం మొదటిది అవుతుంది. అంతవరకు అతడిని అభినందించాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు