భాగ్యశ్రీ నోట తెలుగు మాట

భాగ్యశ్రీ నోట తెలుగు మాట

బాలీవుడ్ లో 29 సంవత్సరాల క్రితం వచ్చిన మైనా ప్యార్ కియా సినిమాలో హీరోయిన్ గా నటించి దేశం మొత్తాన్ని మైకంలో పడేసింది భాగ్యశ్రీ. ఆ తరవాత ఆమె పెద్దగా సినిమాలు చేసిందీ లేదు.. చేసినా ఆడిందీ లేదు. తెలుగులోనూ రెండు మూడు సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసింది. మళ్లీ చాలా రోజుల తరవాత ఆమె తెలుగు తెరపై కనిపించనుంది. దాంతోపాటు తన సొంత గొంతు వినిపించనుంది.

బాలీవుడ్ లో అర్జున్ కపూర్ - ఆలియాభట్ జంటగా నటించిన 2 స్టేట్స్ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ లో హీరో అడవి శేష్ నటిస్తుండగా.. సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అవుతోంది. ఇందులో శివాని బెంగాలీ అమ్మాయిగా నటించనుంది. భాగ్యశ్రీ - బాలీవుడ్ నటుడు రజత్ కపూర్ ఆమె తల్లిదండ్రులుగా కనిపించబోతున్నారు. ఇందులో వీళ్లు తెలుగు కొద్దికొద్దిగానే మాట్లాడతారు. మిగతా డైలాగులన్నీ అంతా హిందీ.. బెంగాలీలోనే ఉంటాయి.

అందుకే రజత్ కపూర్ - భాగ్యశ్రీ ఈ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పడానికి రెడీ అయిపోయారు. వేరేవాళ్లతో డబ్బింగ్ చె్ప్పించేకన్నా వాళ్ల ఓన్ వాయిస్ అయితే పర్ ఫెక్ట్ గా ఉంటుందని డైరెక్టర్ వెంకట్ ఫీలయ్యాడట. దీనికి ఓకే చెప్పే డైలాగులు బాగానే ప్రాక్టీస్ చేసేశారు. హిందీ డైలాగులతో పాటు తెలుగు డైలాగులు కూడా ఇట్టే అర్ధం చేసుకుని చక్కగా డబ్బింగ్ చెప్పారని డైరెక్టర్ అంటున్నారు. ఈరకంగా భాగ్యశ్రీ నోట తెలుగు మాటలు వినబోతున్నామన్న మాట.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు