నయనతార ధైర్యం చూశారా?

నయనతార ధైర్యం చూశారా?

దక్షిణాదిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మాంచి ఊపు తెచ్చిన హీరోయిన్లలో నయనతార ఒకరు. ‘మయూరి’.. ‘కర్తవ్యం’ లాంటి సినిమాలతో ఆమె తిరుగులేని ఇమేజ్ సంపాదించింది. హీరోలతో సమానంగా ఆమె క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు నయన్ ప్రధాన పాత్రలో ‘కోలమావు కోకిల’ అనే మరో థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

మరోసారి నయన్ విలక్షణ పాత్రలో.. అద్భుత అభినయంతో అదరగొట్టేసినట్లు అనిపించింది ఈ ట్రైలర్ చూస్తే. మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 10న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఐతే అదే రోజు ఒక భారీ చిత్రం విడుదల కాబోతుండటం విశేషం. ఆ సినిమా మరేదో కాదు.. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వరూపం-2’.

ఐదేళ్ల కిందట విడుదలై సెన్సేషనల్ హిట్టయిన ‘విశ్వరూపం’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘విశ్వరూపం-2’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. గత నెలలో విడుదలైన దీని ట్రైలర్ క్యూరియాసిటీ పెంచింది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నాడు. అలాంటి భారీ సినిమాను నయన్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఢీకొట్టడబోతుండటం ఆశ్చర్యమే. ఇది పెద్ద సాహసమే అని చెప్పాలి.

కమల్ సినిమా వస్తుందని తెలిసి కూడా ధైర్యంగా అదే రోజుకు రిలీజ్ డేట్ ప్రకటించారంటే వాళ్ల కాన్ఫిడెన్స్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నయనతార ఇమేజ్ ఎలాంటిదో చాటిచెప్పే నిర్ణయమిది. ఐతే ఊరికే డేట్ ఇవ్వడం కాదు.. నిజంగా అదే రోజుకు సినిమాను రిలీజ్ చేస్తే వీళ్ల ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ‘విశ్వరూపం-2’కు పోటీగా విడుదలై ‘కోలమావు కోకిల’ హిట్టయితే నయన్ ఇమేజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు