‘అరవింద సమేత’ మ్యూజిక్ అప్‌డేట్

‘అరవింద సమేత’ మ్యూజిక్ అప్‌డేట్

ఈ ఏడాది తెలుగులో భారీ సినిమాలన్నీ వేసవి లోపే వచ్చేశాయి. రెండో అర్ధానికి మిగిలిన ఏకైక భారీ చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ మాత్రమే. అది తప్ప ఆ స్థాయి భారీ సినిమా మరేదీ లేదు. త్రివిక్రమ్ గత సినిమా ‘అజ్ఞాతవాసి’ ఎంత పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ.. ‘అరవింద సమేత’పై ఆ ఎఫెక్ట్ ఏమీ పెద్దగా పడలేదు.

ఈ చిత్రానికి కావాల్సినంత క్రేజ్ వచ్చింది. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై అమితాసక్తి నెలకొంది. భారీ రేట్లకు ఈ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ముందుకొచ్చారు. బిజినెస్ చాలా ముందుగానే పూర్తయినట్లు చెబుతున్నారు. మరోవైపు త్రివిక్రమ్ శరవేగంగా సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా సీజన్లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్న చిత్ర బృందం.. నిర్విరామంగా షూటింగ్ చేస్తోంది. ఎన్టీఆర్ కూడా పూర్తిగా ఈ చిత్రంపైనే ఫోకస్ పెట్టాడు.

మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం ‘అరవింద సమేత’పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. తొలిసారి త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడంతో తమన్ ముందు నుంచి చాలా ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నాడు. తాజాగా అతను ఒక ఫొటోను షేర్ చేశాడు. ‘అరవింద సమేత’ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న రూంలో కిటికీ దగ్గర త్రివిక్రమ్ కూల్‌గా కూర్చున్న ఫొటో అది.

డైరెక్టర్ ఇంత కూల్‌గా ఉంటే.. పని మరింత కూల్‌గా సాగిపోతుందని.. ‘అరవింద సమత’ మ్యూజిక్ పనులు పూర్తి కావస్తున్నాయని దీనికి కామెంట్ జోడించాడు తమన్. మామూలుగా చాలా వేగంగా మ్యూజిక్ చేసేసే తమన్.. ఈ సినిమాన చాలా ప్రతిష్టాత్మకంగా భావించి ఎక్కువ రోజులు టైం తీసుకుంటున్నాడు. ఆడియో చాలా స్పెషల్ గా ఉండాలని చూస్తున్నాడు. దీని టీజర్లోనే తమన్ తనదైన ముద్ర వేశాడు. పాటలు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయని అంటున్నారు. త్వరలోనే పాటల రికార్డింగ్స్ పూర్తవుతాయని అంటున్నారు. సెప్టెంబర్లో ‘అరవింద సమేత’ ఆడియో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English