మహేష్ మళ్లీ మార్చేశాడే..

మహేష్ మళ్లీ మార్చేశాడే..

కెరీర్లో చాలా వరకు ఒకే రకమైన లుక్స్‌లో కనిపించాడు మహేష్ బాబు. అతడి హేర్ స్టైల్ కానీ.. మిగతా ఆహార్యంలో కానీ పెద్దగా మార్పు కనిపించదు. ‘అతిథి’.. ‘పోకిరి’ లాంటి కొన్ని సినిమాల్లో మాత్రమే కొంచెం లుక్ మార్చాడు. ఐతే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా కోసం మహేష్ లుక్ మార్చాడు. కెరీర్లో తొలిసారిగా కొంచెం ఎక్కువ గడ్డం పెంచి.. జుట్టు కూడా పెంచి.. రఫ్ లుక్‌లోకి మారాడు.

ఈ లుక్‌లోనే తొలి షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. నాలుగు వారాల పాటు విరామం లేకుండా ఉత్తరాఖండ్‌లో ఈ చిత్ర షూటింగ్ చేశారు. ఇటీవలే అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు మహేష్. మధ్యలో మహేష్ నటించిన ప్రకటనల్లో కూడా గడ్డంతోనే కనిపించాడు. ఇక సినిమా అంతే ఇదే లుక్‌లో మహేష్ కనిపిస్తాడేమో అని అంతా అనుకున్నారు.

కానీ సడెన్‌గా గడ్డం తీసేసి క్లీన్ షేవ్‌తో పూర్వపు లుక్‌లోకి మారిపోయాడు మహేష్. ఆదివారం చెన్నై సిల్క్స్ వాళ్ల కొత్త షోరూం ఓపెనింగ్‌కి మహేష్ వచ్చాడు. ఈ సందర్భంగా మహేష్ లుక్ చూసి జనాలు ఆశ్చర్యపోయారు. గడ్డం తీసేసి మళ్లీ పెంచుతాడా.. లేక రెండో షెడ్యూల్లో క్లీన్ షేవ్‌తోనే కనిపిస్తాడా అన్నది అర్థం కావడం లేదు. బహుశా సినిమాలో ఒక ఎపిసోడ్ వరకు మహేష్ గడ్డంతో కనిపిస్తాడేమో అనుకుంటున్నారు.

త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్, పొట్లూరి వరప్రసాద్ ఉమ్మడిగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబుకిది 25వ చిత్రం కావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం చాన్నాళ్ల ముందే కొన్ని ట్యూన్లు రెడీ చేశారు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రం ప్రేక్షకలు ముందుకు వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English