సొంత సినిమాపై దిల్‌ రాజు సవతి ప్రేమ

సొంత సినిమాపై దిల్‌ రాజు సవతి ప్రేమ

లవర్‌ కూడా దిల్‌ రాజు నిర్మిస్తోన్న సినిమానే అయినప్పటికీ నిర్మాతగా తన పేరు కాకుండా మేనల్లుడు హర్షిత్‌ రెడ్డి పేరు వేస్తున్నాడు. ఈమధ్య చాలా సినిమాలకి శిరీష్‌ పేరుని నిర్మాతగా వేసిన దిల్‌ రాజు ఇకపై తన బ్యానర్‌నుంచి వచ్చే అన్ని సినిమాలకీ నిర్మాతగా పేరు వేసుకోడట. అయితే ఎవరి పేరు వేసినప్పటికీ అది దిల్‌ రాజు సినిమాగానే చలామణీ అవుతుందనేది వేరే సంగతి.

ఇకపోతే తన బ్యానర్‌ నుంచి వచ్చే సినిమాలన్నిటికీ ఓవర్‌గా సందడి చేసే దిల్‌ రాజు లవర్‌ చిత్రానికి మాత్రం ఎక్కువ ఎక్సయిట్‌ అవడం లేదు. జులై 10న వచ్చే దీనికంటే ఆగస్టు 9న రాబోతున్న శ్రీనివాస కళ్యాణం మీదే దిల్‌ రాజుకి నమ్మకం ఎక్కువ అని అతని సన్నిహిత వర్గాలే చెబుతున్నాయి. లవర్‌ చిత్రానికి తూతూ మంత్రంగా పబ్లిసిటీ కానిచ్చేసి, అది విడుదలైన వారంలోనే శ్రీనివాస కళ్యాణం సందడి మొదలు పెట్టడానికి ప్రణాళిక కూడా వేసేసినట్టు తెలిసింది.

రాజ్‌ తరుణ్‌ రీసెంట్‌ ఫామ్‌ వల్ల లవర్‌కి ఎలాంటి క్రేజ్‌ లేకుండా పోయింది. దిల్‌ రాజు కూడా దానిని అగ్రెసివ్‌గా ప్రమోట్‌ చేయకుండా ఎంత వస్తే అంత చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సొంత సినిమాపై ఈ సవతి ప్రేమ ఎందుకనేది వచ్చే శుక్రవారానికి తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English