విమర్శలపై సంజయ్ దత్ స్పందించాడు

విమర్శలపై సంజయ్ దత్ స్పందించాడు

బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘సంజు’ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.  రూ.300 కోట్ల మార్కుకు చేరువగా ఉన్న ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలూ పెద్ద ఎత్తున వచ్చాయి. బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదుడిగా పేరున్న సంజయ్‌కి ఆ ఇమేజ్ చెరిపేసి.. అతడిని అమాయకుడిలా ప్రొజెక్ట్ చేయడానికి హిరాని చేసిన ప్రయత్నంగా ఈ సినిమాను విమర్శించారు సీనియర్ పాత్రికేయులు, విశ్లేషకులు. ఈ విమర్శలపై హిరాని ఏమీ స్పందించలేదు కానీ.. సంజయ్ దత్ మాత్రం రెస్పాండయ్యాడు. సినిమాలో చూపించినవన్నీ నిజాలే అని.. తాను నిజాయితీగా తన గురించి అన్ని విషయాలూ చెప్పానని.. దాన్నే సినిమాగా తీశారని సంజయ్ అన్నాడు.

‘‘చాలా ఏళ్ల కిందట నేను ‘మున్నాబాయ్ ఎంబీబీఎస్‌’ సినిమాలో నటించను. నా నిజ జీవిత వ్యక్తిత్వాన్నే అందులో చూపించారు. ఇప్పుడు నా కథనే ‘సంజు’గా తీశారు. నాకు తెలిసి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని మార్చి చూపించడానికి 40 కోట్లు ఖర్చు చేస్తారని నేనైతే అనుకోను. అది చాలా ఎక్కువ. నా గురించి అన్ని నిజాలూ చెప్పేశాను. వాటిని దేశం స్వీకరించింది. ఆ విషయం సినిమా రాబట్టిన వసూళ్లు చూస్తే అర్థమవుతుంది. అందులో చూపించింది అబద్ధమైతే ఇంతమంది ప్రేక్షకులు ఆ సినిమాను ఎందుకు ఆదరిస్తారు? నేను జీవితంలో ఎక్కువ తప్పులే చేశాను. అందుకు శిక్షగా జైలుకు కూడా వెళ్లొచ్చాను. కానీ దాని గురించి నేనేమీ బాధపడటం లేదు’’ అని సంజయ్ అన్నాడు. ఐతే ‘సంజు’కు మంచి కలెక్షన్లు వచ్చినంత మాత్రాన జనాలు సంజయ్‌ దత్‌ను అభిమానిస్తున్నట్లు, అతడి గురించి సినిమాలో చూపించిందంతా నిజమే అనుకుంటున్నట్లు భావిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English