యాభైకి తగ్గనంటున్న పెళ్ళైన హీరోయిన్

యాభైకి తగ్గనంటున్న పెళ్ళైన హీరోయిన్

కాలం గడుస్తున్న కొద్దీ హీరోయిన్లకు గ్లామర్ తగ్గుతుంది. గ్లామర్ తగ్గుతున్న కొద్దీ ఆఫర్లు తగ్గుతాయి. ఆఫర్లు తగ్గినప్పుడు రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇది మామూలుగా జరిగేదే. కానీ సొగసరి శ్రియా సరన్ మాత్రం ఈ విషయంలో కాస్త డిఫరెంట్. ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు దాటిపోతోంది. కానీ ఇప్పటికే ఆమె గ్లామర్ రోల్స్ కు సూటయ్యేలానే కనిపిస్తుంటుంది.

వయసు పెరిగినా సొగసు తరగని బ్యూటీ కావడంతో శ్రియకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్య సీనియర్ హీరోల పక్కవ హీరోయిన్ గా నటించిన ఆమె తాజాగా ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేసేందుకు ఓకే చెప్పింది. ఈ సినిమా కోసం శ్రియ రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకుందని తెలిసింది. డీ గ్లామర్ రోల్ కావడంతో ఈ పాత్ర చేయడానికి అరకోటి అడిగి మరీ తీసుకుందని టాక్. సింప్లీ 50 లక్షలు అంటూ పాకెట్లో వేసుకుందట. సినిమాటోగ్రాఫర్ సుజన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రియది చాలా ఇంపార్టెంట్ రోల్ కావడంతో ఆమె అడిగినంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పేశారట.

శ్రియ రీసెంట్ గా రష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చేవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనేదీ లేదని ముందే చెప్పేసింది. అన్నట్టుగానే కొద్దిరోజుల్లోనే షూటింగ్ స్పాట్ కు వచ్చేసింది.  సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్లకు కాస్తో కూస్తో క్రేజ్.. డిమాండ్ తగ్గుతుంది. కానీ శ్రియ ఈ విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English