2.0 దారిలోనే వెళుతున్న సాహో

2.0 దారిలోనే వెళుతున్న సాహో

బాహుబలి అఖండ విజయం తరవాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు దేశమంతటా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దీంతో దీని తరవాత మొదలుపెట్టిన సాహో సినిమాను తెలుగుతో పాటు తమిళం - హిందీ భాషల్లో ఒకసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టెయినర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు దేశంలో ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న భారీ సినిమాల్లో సాహో ముందే ఉంటుంది.

ఈమధ్యనే దుబాయ్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసుకుని సాహో టీం ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఓ భారీ షెడ్యూల్ కంటిన్యూ అవుతోంది. బాహుబలి వచ్చేసి ఏడాది అయిపోతుండటంతో ప్రభాస్ అభిమానులంతా సాహో కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ సాహో టీం మాత్రం రిలీజ్ విషయంలో ఓ నిర్ణయానికి రావడం లేదు. ఇప్పటికే ఇదే రేంజిలో రూ. 300 కోట్ల బడ్జెట్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ డైరెక్ట్ చేస్తున్న 2.0 సినిమా రిలీజ్  ఎప్పుడనేది ఓ పట్టాన తేల లేదు. ఎప్పటికప్పుడు డేట్ ప్లాన్ చేయడం.. వాయిదా వేయడం మామూలైపోయింది. ఈ మధ్యనే కొత్తగా నవంబర్ 29 అనే డేటిచ్చారు.

సాహో విషయానికి వస్తే.. ఈ ఏడాది చివరిలోగా వస్తుందనే మాట యూనిట్ నుంచి రావడం లేదు. సంక్రాంతికి ఇప్పటికే మూడు నాలుగు పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఫలానా నెలకు రావచ్చనే హింట్ ఇవ్వడం చాలా అవసరం. 2.0 స్థాయిలో కాకపోయినా సాహోలోనూ గ్రాఫిక్స్ కీలకమే. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేసి గ్రాఫిక్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేసేదీ ఇంకా క్లారిటీ రాలేదు. 2.0కూ ఇదే సమస్య ఎదురైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రిలీజ్ డేట్ పై సాహో యూనిట్ ఓమాట అనుకుంటే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English