తెరపై మన డ్రైవర్ కథ

తెరపై మన డ్రైవర్ కథ

సందేహమే అక్కర్లేదు. ఇప్పుడు బయోపిక్ ల హవాయే నడుస్తోంది. తెలుగు తమిళం హిందీ ఇలా అన్ని భాషల్లోనూ వరసగా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే తెలుగులో అలనాటి మేటి నటి సావిత్రి జీవితగాథగా వచ్చిన మహానటి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తాజాగా హిందీలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన సంజు రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతోంది.

తాజాగా బాలీవుడ్ లో స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ వస్తోంది. రేసు కార్ డ్రైవర్.. అదేనండీ ఫార్ములా వన్ రేసర్ నారాయణన్ కార్తికేయన్ జీవిత కథతో సినిమా తీయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. తమిళనాడులో పుట్టి పెరిగిన నారాయణన్ కార్తికేయన్ 2005 గ్రాండ్ పిక్స్ లో పార్టిసిపేట్ చేశాడు. ఫార్ములా వన్ ఇష్టపడే వారందరికీ అతడు సుపరిచితుడు. అందుకే అతడి కథతో తమిళం హిందీ భాషల్లో సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న ఉఫేన్ పటేల్ టైటిల్ రోల్ చేసే అవకాశం ఉంది.

ఈ జనరేషన్ లో బయోపిక్ ల హవా మొదలైంది ఎం.ఎస్. ధోని సినిమాతోనే. ఆ తరవాత సచిన్ టెండుల్కర్ బయోపిక్ సచిన్ : ఎ బిలియన్ డ్రీమ్స్ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్ జీవిత కథతోనూ సినిమా ప్లాన్ చేస్తున్నారు. సుధీర్ బాబు ఇందులో హీరోగా నటించనున్నాడు. దీంతోపాటు నైనా సెహ్వాల్ కథతో తీస్తున్న సినిమాలో శ్రద్ధ కపూర్ టైటిల్ రోల్ చేయబోతోంది. చూడబోతే మరిన్ని స్పోర్ట్స్ పర్సన్ల బయోపిక్ లు వచ్చేలానే ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు