ఇలియానాకు ఇంకా లోకువేనా?

ఇలియానాకు ఇంకా లోకువేనా?

గోవా సుందరి ఇలియానా చాలా రోజుల తరవాత టాలీవుడ్ వైపు తొంగి చూసింది. ఎన్నో ఆశలతో బాలీవుడ్ వెళ్లిన ఆమెకు ఎన్నాళ్లయినా కలిసొచ్చిందేం లేదు. సరైన ఆఫర్లు లేకపోవడంతో ఖాళీగా ఉన్న రోజులే ఎక్కువ. దీంతో తిరిగి మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో తిరిగి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.

రెండు వారాల క్రితం అమర్ అక్బర్ ఆంటోని యూనిట్ అమెరికాకు వెళ్లింది. అక్కడ షెడ్యూల్ పూర్తవడంతో ఇలియానా టెంపరరీగా యూనిట్ కు బైబై చెప్పేసింది. నెల రోజుల తరవాత ఇంకో షెడ్యూల్ లో ఆమె జాయిన్ కానుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ షూటింగ్ కు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఫొటో కూడా సోషల్ మీడియా పోస్ట్ చేయలేదు. అదే బాలీవుడ్ సినిమాల్లో అయితే సినిమా ఓకే చేసింది మొదలు రోజుకో అప్ డేట్ తో అభిమానులకు బోలెండత సమాచారం ఇచ్చింది. కానీ అదేంటో మొదటి నుంచి తెలుగు సినిమా అంటే లోకువో ఏంటో సినిమాకు సంబంధించి ఒక్క మాటా మాట్లాడలేదు. షూటింగ్ స్పాట్ నుంచి ఒక్క ఫొటో షేర్ చేయడానికి ఇష్టపడలేదు.

గోవా నుంచి వచ్చిన ఇలియానాకు హీరోయిన్ గా లైఫ్ ఇచ్చింది.. ఆమెకు స్టార్ హీరోయిన్ స్థాయికి చేర్చింది టాలీవుడ్. ఇక్కడ టాప్ హీరోయిన్ గా వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్ లో అవకాశం దక్కింది. ఒకటి రెండు సినిమాల్లో ఆఫర్లు రావడంతో టాలీవుడ్ కు టాటా చెప్పేసి ముంబయికి మకాం మార్చేసింది. ఇక తిరిగిరానంటూ చాలా ఏళ్లుగా అక్కడే ఉండిపోయింది. అక్కడ సాధించిందేం లేకపోవడంతో డీలాపడింది. దీంతో లైఫ్ ఇచ్చిన టాలీవుడ్డే మళ్లీ దిక్కయ్యింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English