సంజయ్ దత్ 308.. రణబీర్ 10 ప్లస్

సంజయ్ దత్ 308.. రణబీర్ 10 ప్లస్

సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన ‘సంజు’ సినిమాలో అతడి రాసలీలల గురించి వివరంగా చూపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆ వ్యవహారాల్ని పైపైన చూపించి వదిలేశాడు దర్శకుడు రాజ్ కుమార్ హిరాని. ఐతే ఒక సీన్లో సంజయ్ పాత్రధారి అయిన రణబీర్.. తనకు 308 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్లుగా డైలాగ్ చెబుతాడు. దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది.

సంజయ్‌కి మామూలుగానే స్త్రీలోలుడు అనే పేరుంది. అమ్మాయిల్ని బుట్టలో వేయడం కోసం వాళ్లను అతను తన తల్లి సమాధి దగ్గరికి తీసుకెళ్లి ఎమోషనల్‌గా కదిలించేవాడన్న విషయం కూడా వెల్లడైంది. సంజయ్ గర్ల్‌ఫ్రెండ్స్‌లో హీరోయిన్లతో పాటుగా కొందరు సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారన్న చర్చ కూడా నడిచింది.

కాగా ‘సంజు’ ప్రమోషన్లలో భాగంగా రియల్ సంజయ్ దత్, రీల్ సంజయ్ దత్ రణబీర్ కపూర్ కలిసి ఒక కార్యక్రంలో పాల్గొనగా.. ఇక్కడ వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది అనే చర్చ వచ్చింది. సినిమాలో నాకు 308 మంది గర్ల్ ఫ్రెండ్స్ అన్నారు కదా.. ఇంతకీ మీకెంత మంది గర్ల్ ఫ్రెండ్స్ అని రణబీర్‌ను అడిగితే.. నా గర్ల్ ఫ్రెండ్స్ పది మంది కంటే తక్కువ అని అతను బదులిచ్చాడు.

దీనిపై సంజయ్ స్పందిస్తూ.. ‘రణబీర్‌కు పది మంది కంటే ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కావాలంటే ఈ విషయంలో పందెం కూడా కాస్తాను’ అని సవాలు విసరడం విశేషం. ఐతే రణబీర్ ఈ విషయంలో ఇంకేమీ స్పందించలేదు. అతను కెరీర్ ఆరంభంలో దీపికా పదుకొనేతో ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో పెళ్లిదాకా వెళ్లాడు. ఇప్పుడు ఆలియా భట్‌తో ప్రేమలో ఉన్నాడని.. త్వరలోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇవి కాక మధ్యలో రణబీర్‌కు వేరే లవ్ స్టోరీలు కూడా ఉన్నట్లు రూమర్లున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English