మహేష్ మేనల్లుడి కష్టాలు చూసారా

మహేష్ మేనల్లుడి కష్టాలు చూసారా

టాలీవుడ్ లో మరో వారసుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు.. టసూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేస్తూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా నిర్మించనున్నాడు. అతడి మొదటి సినిమా కోసం కథ ఎప్పుడో సిద్ధం చేసి ఉంచారు. ఇప్పుడీ సినిమా కథలో ట్విస్ట్ ఏంటంటే డైరెక్టర్ మారిపోయాడు.  

గల్లా అశోక్ ను హీరోగా పరిచయం చేసే సినిమాకు డైరెక్టర్ ఆడు మగాడ్రా బుజ్జీ ఫేమ్ కృష్ణారెడ్డి గంగదాసును ఎంపిక చేసుకున్నాడు. అతడు చాలా రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించి వర్క్ చేస్తూ వస్తున్నాడు. కానీ అతడి పనితీరు అటు గల్లా ఫ్యామిలీకి కానీ.. ఇటు ప్రొడ్యూసర్ దిల్ రాజుకు కు కానీ అంత సంతృఫ్తికరంగా లేదని ఫీలవుతున్నారు. దీంతో ఈ సినిమా డైరెక్టర్ గా శశి అనే కొత్త కుర్రాడిని తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు.

నిజానికి ఆల్రెడీ లవ్ లవ్స్ కోయిన్సిడెన్సస్ అనే టర్కీ ఫిలింను ఆధారంగా చేసుకుని.. హిందీలో ఇప్పటికే సనమ్ రే అంటూ సినిమా తీస్తే.. అది ఫ్లాపైంది. ఇప్పుడు అదే టర్కీ సినిమాను ఇలా తెలుగులో రీమేక్ చేస్తున్నారు దిల్ రాజు. అందుకే ఈ సినిమా విషయంలో రిజల్ట్ ఏమవుతుందోనని తెగ ఆందోళన చెందుతూ.. ఇలా కొత్త కొత్త డెసిషన్లు తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు