ప్చ్.. రకుల్ సెట్టవలా..

ప్చ్.. రకుల్ సెట్టవలా..

మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి లక్ కలిసిరావడంతో హీరోయిన్ గా మారింది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తక్కువ సినిమాలతోనే స్టార్ డమ్ సంపాదించుకోగలిగింది. తెలుగులో యంగ్ జనరేషన్ లో హీరోలందరితోనూ ఆడిపాడింది. స్పైడర్ తరవాత రకుల్ కెరీర్ ఉన్నట్టుండి డౌనయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.

ఈ టైంలో రకుల్ ఉన్నట్టుండి తనకు మొదట పేరు తెచ్చిన మోడలింగ్ వైపు మళ్లీ అడుగులేసింది. ఇప్పుడు పెద్ద హీరోయిన్ కాబట్టి ఫేమస్ అయే యాడ్ లోనూ కనిపిచింది. సినీ తారల సౌందర్య రహస్యం అంటూ స్టార్ల పబ్లిసిటీతో సేల్స్ పెంచుకుంటున్న లక్స్ సోప్  యాడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ మెరుపులు మెరిపించింది. లక్స్ కొత్తగా ప్రవేశపెట్టిన శాఫ్రన్ గోల్డ్ యాడ్ లో కనిపించి తన కాన్ఫిడెన్స్ వెనుక రహస్యం ఇదంటూ చెప్పుకొచ్చింది.

అసలు లక్స్ యాడ్ లో కనిపించే హీరోయిన్లంటేనే ప్రేక్షకుల్లో ఓ ఆసక్తి ఉంటుంది. శ్రీదేవి... ప్రీతాజింతా.. కరీనా కపూర్ ఇలా ఎంతోమంది హీరోయిన్లు ఈ సోప్ యాడ్ లో నటించారు. కానీ రకుల్ మాత్రం ఎందుకో ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ యాడ్డుకి ఆమె సెట్టవ్వలేదనే అనిపిస్తోంది. బహుశా ఆఫర్లు లేక డీలాగా ఉన్న టైంలో సెల్ఫ్ కాన్ఫెడెన్స్ అంటూ డైలాగులు చెప్పాల్సి రావడం వల్లనా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు