నిజంగానే 24 సార్లు పెట్టేసింది

నిజంగానే 24 సార్లు పెట్టేసింది

మొదటి సినిమా కుమారి 21 ఎఫ్ తోనే హీరోయిన్ హెబ్బా పటేల్ కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టేసింది. పర్ ఫెక్ట్ ఫిజిక్.. అట్రాక్టివ్ గ్లామర్.. అందమైన చిరునవ్వుతో చలాకీగా నటించే హెబ్బా త్వరగా స్టార్ హీరోయిన్ అవుతుందని అనిపించింది. కానీ హెబ్బా క్రేజ్ ఎక్కువ కాలం కంటిన్యూ అవలేదు. కుమారి 21 ఎఫ్ తరవాత మళ్లీ ఆ స్థాయిలో హెబ్బా పటేల్ మాయ చేయలేకపోయింది.

ఇన్నాళ్ల తరవాత హెబ్బా పటేల్ కుర్రాళ్లను ఆకట్టుకునే సినిమాలో కనిపించనుంది. అదిత్ అరుణ్ హీరోగా నటిస్తున్న 24 కిసెస్ లో హీరోయిన్ గా నటించింది. ఇందులో ప్రొఫెసర్ తో ప్రేమలో పడే మీడియా స్టూడెంట్ గా నటించింది. టైటిల్ లో చెప్పేసినట్టు హెబ్బా ఈ సినిమాలో మొత్తం 24 ముద్దులూ పెట్టిందట. ప్రతి ముద్దుకు ఓ లెక్క.. కారణం పక్కాగా ఉంటాయట. ఈ రోల్ గురించి మొదట చెప్పినప్పుడు తాను చేయగలుగుతానా లేదా అని ఫీలయ్యానని.. స్టోరీ మొత్తం విన్నాక కాన్ఫిడెన్స్ రావడంతో ఈ సినిమా చేశానని చెబుతోంది.

ఈ సినిమాలో ప్రతి లిప్ లాక్ వెనుక ఓ సిట్యుయేషన్ అండ్ టైమింగ్ ఉంటాయిట. ఎంతో భావుకతతో తీసిన ఈ ముద్దు సీన్లు అందరినీ మెప్పిస్తాయని అంటోంది. ఇంతకు ముందు చేసిన సినిమాల్లోనూ కిస్ సీన్లు చేశానని.. సబ్జెక్టు డిమాండ్ చేస్తే ఇకపైనా చేయడానికి రెడీగానే ఉన్నానని అంటోంది. హెబ్బా. 24 ముద్దులతో 21 ఎఫ్ సుందరి తిరిగి పాత క్రేజ్ దక్కించుకుంటానని నమ్మకంతో ఉంది. మిణుగురులు సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న అయోధ్య కుమార్ 24 కిసెస్ మూవీని డైరెక్ట్ చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు