హెల్ప్ మీ మావయ్యా.. అంటున్న మేనల్లుడు

హెల్ప్ మీ మావయ్యా.. అంటున్న మేనల్లుడు

విజయవంతంగా ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ఒకానొక టైంలో హిట్లతో మాంచి జోష్ మీద కనిపించిన తేజు అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈమధ్య కాలంలో సినిమాలు ఎంచుకోవడంలో వేసిన తప్పటడుగులు అతడి కెరీర్ నే ప్రమాదంలో పడేశాయి. ఈ రోజుల్లో ప్రామాణికంగా లెక్కేస్తున్న ఫస్ట్ డే కలెక్షన్లు వరుసగా తగ్గిపోతుండటం అతడి కెరీర్ పైనే ప్రభావం చూపే అంశమవుతోంది.

ఈ టైంలో సాయి ధరమ్ తేజ్ నుంచి రాబోయే సినిమాలతో గ్యారంటీగా హిట్  కొడితేనే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం తేజు చేతిలో చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్ సినిమా ఒక్కటే ఉంది. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈమూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. కెరీర్ లో అత్యంత కీలకమైన టైంలో ఉన్న సాయిధరమ్ తిరిగి ఇమేజ్ పెంచుకునే సలహాల కోసం మేనమామ.. మెగా స్టార్ చిరంజీవిని ఆశ్రయించాడు. కథల జడ్జిమెంట్ లో మంచి పట్టున్న చిరు ఓకే చెబితేనే ఈ సినిమా అయినా చేద్దామని  నిర్ణయించకున్నాడనేది లెటేస్ట్ టాక్. హెల్ప్ మీ మావయ్య అంటూ ఆల్రెడీ ఫోన్ కూడా చేసేశాడట.

ఇప్పుడు తాను చేస్తున్న చిత్రలహరి సినిమా స్క్రిప్ట్ ను కూడా చిరు దగ్గరకు పంపించాడని తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు ప్రయోగాలను పక్కన పెట్టి మామయ్య చూపించిన బాటలో వెళ్లిపోవాలని అనుకుంటున్నాడు. అందుకే స్వయంగా ఫోన్ చేసి మరీ సహాయం అడిగాడని తెలుస్తోంది.  మరి చిత్రలహరి సినిమా స్క్రిప్ట్ విషయంలో చిరు ఎలాంటి మార్పుచేర్పులు చెప్పబోతున్నాడు వేచి చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English