నాగ్-నాని.. డేట్ మార్చుకున్నారు

నాగ్-నాని.. డేట్ మార్చుకున్నారు

టాలీవుడ్లో మల్టీస్టారర్ల ట్రెండ్ బాగానే ఊపందుకుంది. ఈ ఏడాది నాలుగైదు ఆసక్తికర మల్టీస్టారర్లకు రంగం సిద్ధమైంది. అందులో కొన్ని ఆల్రెడీ సెట్స్ మీదికి కూడా వెళ్లాయి. అందులో ‘దేవదాస్’ కూడా ఒకటి. కింగ్ అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి ఇటీవలే ‘దేవదాస్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ‘భలే మంచి రోజు’.. ‘శమంతకమణి’ సినిమాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

‘దేవదాస్’ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 12న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి సినిమా రెడీ అయ్యే అవకాశం లేదట. అందుకే డేట్ మార్చుకున్నారు. సెప్టెంబరు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. పోటీ ఏమీ లేకుండా సోలోగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఒక దశలో దసరా రిలీజ్ అనుకున్నారు కానీ.. అప్పటికి పోటీ తీవ్రంగా ఉంటుందని భావించి ముందు నెలే రిలీజ్ చేసేస్తున్నారు.

‘మహానటి’తో మళ్లీ ఫామ్ అందుకున్న సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన బేనర్లో అనేక సినిమాలకు పని చేసిన మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. నాగ్ సరసన ‘మళ్లీ రావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్, నానికి జోడీగా రష్మిక మందాన్నా ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో నాగ్ డాన్ పాత్ర చేస్తుంటే.. నాని డాక్టర్‌గా కనిపిస్తాడట. ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు