ఇక మగధీర మీద పడ్డారు

ఇక మగధీర మీద పడ్డారు

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రికార్డులు తిరగరాసింది. ఇండియా మొత్తం మీద అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న సినిమాగా రికార్డు దక్కించుకుంది. ఇండియాలో రిలీజైన ప్రతి భాషలోనూ బాహుబలి అభిమానులను మెప్పించింది. తరవాత ఇతర దేశాల భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. దాదాపుగా ప్రతి భాషలోనూ బాహుబలికి మంచి ఆదరణే దక్కింది.

ఈమధ్య బాహుబలి సినిమాను జపనీస్ భాషలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ అద్భుతమైన ఆదరణ లభిస్తోందని.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నాడని సినిమా టీం చెబుతోంది. మరీ అంత బ్రహ్మాండమైన హిట్ కాకపోయినా ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టింది బాహుబలి. కానీ ఈ సినిమాలో క్యారెక్టర్లు మాత్రం అక్కడి ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. వాళ్ల ఆహ్వానం మేరకు ఆ మూవీలో కుమారవర్మ పాత్రలో నటించిన సుబ్బరాజు జపాన్ వెళ్లి అభిమానులను కలిసి వచ్చాడు. బాహుబలి ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర దుమ్ము దులిపి జపాన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మగధీర 2009లో రిలీజైంది. అంటే దాదాపుగా పదేళ్లు కావస్తోంది. బాహుబలికి.. రాజమౌళికి ఇప్పుడు క్రేజ్ గుర్తింపు వచ్చేసరికి దానిని సొమ్ము చేసుకోవడానికి ఇప్పుడు మగధీరుడిని జపాన్ లో చూపించడానికి రెడీ అయిపోతున్నారు. కాకుంటే మగధీరలో రాజులు... యుద్ధాలు ఎపిసోడ్ కొద్దిసేపే ఉంటుంది. మిగతాదంతా ఇఫ్పటి కాలంలో నడుస్తుంది. మరి అది జపాన్ వాళ్లకు నచ్చుతుందా? ఏమో డౌటే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు