నాని - శర్వానంద్ ను కలిపిన రాజుగారు

నాని - శర్వానంద్ ను కలిపిన రాజుగారు

మల్టీ స్టారర్ పై మనసుపడ్డ రాజుగారు

ఈ జనరేషన్ లో పెద్ద మల్టీస్టారర్ మూవీస్ కు శ్రీకారం చుట్టింది ప్రొడ్యూసర్ దిల్ రాజునే. వెంకటేష్ - మహేష్ లతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ప్రొడ్యూస్ చేసి తెలుగులోనూ పెద్ద హీరోలతో మల్టీ స్టారర్ తీయడం సాధ్యమని ప్రూవ్ చేశాడు. ఆ తరవాత సినిమాలు చాలానే ప్రొడ్యూస్ చేసినా దిల్ రాజు కు ఇంకా మల్టీస్టారర్ పై మాత్రం ఇష్టం అలాగే ఉన్నట్టుంది.  అందుకే ప్రస్తుతం వరుసగా మల్టీస్టారర్ మూవీలే ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నాడు.

ప్రస్తుతం దిల్ రాజు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇందులో కామెడీ హీరో అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. రీసెంట్ గా వెంకటేష్ - వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సినిమా షూటింగ్ మొదలైంది. తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో మరో మల్టీస్టారర్ తీయబోతున్నట్లు దిల్ రాజు ప్రకటించేశాడు. ఇందులో యంగ్ హీరోలు నాని - శర్వానంద్ కలిసి నటించబోతున్నారని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది.

సినిమాల ప్రొడక్షన్ విషయంలో సంఖ్యాపరంగా చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోదు. కానీ మల్టీస్టారర్ సినిమాల విషయంలో టాలీవుడ్ చాలా వెనకబడి ఉందనే చెప్పాలి. కొత్తగా లాంచ్ అవుతున్న హీరో నుంచి స్టార్ల వరకు సోలో హీరోలుగానే సినిమాలొస్తాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు మారుతోంది. మల్టీస్టారర్ పై హీరోలూ ఆసక్తి చూపుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English