రాజమౌళి రివ్యూ ముందే ఇచ్చేశాడే?

రాజమౌళి రివ్యూ ముందే ఇచ్చేశాడే?

దర్శక ధీరుడు ఎస్.ఎస్.ఏదన్నా సినిమా చూసొచ్చి పాజిటివ్ గా కామెంట్ పెడితే గ్యారంటీగా అది ఆ మూవీకి ప్లస్ పాయింట్ అవుతోంది. ప్రేక్షకులు కూడా ఫలానా సినిమాపై రాజమౌళి ఎలా స్పందిస్తాడా అని ఇంట్రస్ట్ గా ఎదురుచూస్తుంటారు. దానికి తగ్గట్టే వీలైనంత వరకు చాలా సినిమాలకు తనదైన స్టయిల్లో రివ్యూ ఇస్తుంటాడు.

కానీ మొదటిసారి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే తన రివ్యూ చెప్పేయడం నెటిజన్లను ఆశ్చర్య పరిచింది. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమాను మెచ్చుకుంటూ రాజమౌళి రిలీజ్ కు ముందు రోజే ట్విట్టర్ లో కామెంట్ పెట్టేశాడు. ''తండ్రి కొడుకుల కథతో గుండెకు హత్తుకునేలా వారాహి చలన చిత్రం నుంచి సినిమా వస్తోంది. పాటలు.. ట్రయిలర్ కొత్తగా ఉన్నాయి. విజేత టీం మొత్తానికి అభినందనలు'' అంటూ రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు పెట్టాడు.

కెరీర్ లో ఫ్లాపన్నది ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి బ్రహ్మాండమైన విజయం సాధించడంతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు రాజమౌళి పేరే ఓ బ్రాండ్ తయారైంది. ఆయన జడ్జిమెంట్ పై ఇండస్ట్రీలో అందరికీ కాన్ఫిడెన్స్ ఏర్పడింది. కానీ ఈసారి విజయం సాధించాలని కోరుకుంటూనే తన రివ్యూ ఇచ్చేశాడా ఏంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు