సమంత స్పెషల్ సరదా ఏంటంటే..

సమంత స్పెషల్ సరదా ఏంటంటే..

కొత్తగా షోరూంలు.. మాల్స్ ప్రారంభించేటప్పుడు హీరోయిన్లతో రిబ్బన్ కట్ చేయించడం అనే ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. కొన్నాళ్ల క్రితం వరకు మెట్రో సిటీలు.. నగరాల్లో మాత్రమే ఇలా చేసేవారు. ఏ హీరోయిన్ ఫాంలో ఉంటే ఆ హీరోయిన్ ను తమ షాపుకు తీసుకొచ్చి భారీగా పబ్లిసిటీ చేసేవారు. హీరోయిన్లను చూడటానికి జనాలు భారీగా రావడంతో షాపు పేరు జనాల నోళ్లలో నానేది.

ఈమధ్య కాలంలో హీరోయిన్లను ఆహ్వానించడమనే ట్రెండ్ టౌన్ స్థాయికి కూడా వచ్చేసింది. చిన్నషాపుల వాళ్లు కొత్తగా వస్తున్న హీరోయిన్లు.. కాస్త ఫామ్ తగ్గిన బ్యూటీలను తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత ఈ లిస్టులో జాయినైంది. కానీ ఆమె రిబ్బన్ కట్ చేసింది ఓ చిన్న కేఫ్ కి. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకునే మార్గం కాబట్టి చిన్నచిన్న హీరోయిన్లు సైడ్ ఇన్ కమ్ కోసం ఇలాంటి రిబ్బన్ కటింగులకు అటెండవడం మామూలే.

కానీ సమంత టాలీవుడ్.. కోలీవుడ్ లలో ప్రస్తుతం టాప్ స్టార్. అక్కినేని ఫ్యామిలీకి కోడలు. మరి అలాంటప్పుడు ఇంత చిన్న షాప్ ఓపెనింగ్ కి సమంత రావడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. కానీ శామ్ ఈ ప్రోగ్రాంకు సరదాగా అటెండయిందని తెలిసింది. ఎప్పుడూ యాక్టివ్ గా.. జోవియల్ ఉండే ఆమె కాస్తంత కొత్తగా ఉంటుందని  ఈ కేఫ్ ఓపెనింగ్ కు అటెండయిందట. ఏమయినా సమంత సరదా స్పెషల్ గానే ఉంది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు