ఇది మామూలు టూమచ్ కాదు నాయనో

ఇది మామూలు టూమచ్ కాదు నాయనో

గాలి ఎప్పుడు ఏ దిశకు వీస్తుందో.. శ్రీరెడ్డి వేలు ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేసి చూపిస్తుందో చెప్పడం చాలా కష్టం. కాస్టింగ్ కౌచ్ పై పోరాటమంటూ వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి టీవీ ఛానళ్ల పుణ్యమా అని బాగానే పాపులరయిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటంతో ఆమె వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆ తరవాత టీవీ ఛానళ్లు ఆమెను పట్టించుకోవడమే మానేశాయి.

అలాగని శ్రీరెడ్డి అంతటితో వదిలేయకుండా సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇంతవరకు టాలీవుడ్ లోని సెలబ్రిటీలనే టార్గెట్ చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు కోలీవుడ్ ను టార్గెట్ చేసింది. తమిళ్ టాప్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ తనకు అన్యాయం చేసిన వారిలో ఉన్నాడంటూ ఫేస్ బుక్ వేదికగా ఓ కొత్త పాట అందుకుంది. రైటర్ వెలిగొండ శ్రీనివాస్ కారణంగా తనకు ఎ.ఆర్.మురుగదాస్ తో పరిచయమైందని.. తాము ఓ స్టార్ హోటల్ కలుసుకున్నామని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. తమ మధ్య సంభాషణలు సుదీర్ఘంగా సాగాయని.. ఆ తరవాత అతడు తనకు  చేసిన ప్రామిస్ లన్నీ గాలికొదిలేశాడంటూ ఆరోపించింది.

ఇంతకుముందు శ్రీరెడ్డి టాలీవుడ్ హీరో నాని.. డైరెక్టర్ శేఖర్ కమ్మలుపైనా ఇలాంటి ఆరోపణలే చేసింది. బిగ్ బాస్ సీజన్-2 ప్రారంభ సమయంలో నాని గురించి అతి జుగుప్సాకరంగా కామెంట్లు చేసింది. ఆ టైంలో ఆమె తనవద్ద ఆధారాలు ఉన్నాయని.. అవి తరవాత బయటపెడతానంటూ మాట దాటేసింది. ఇప్పుడు మురుగదాస్ విషయంలోనూ ఇదే తీరు. ఎలాంటి సాక్ష్యాలు లేవు.. ఆరోపణలు తప్ప. అయినా నోటికి వచ్చిన పేరల్లా చెప్పేస్తే సరిపోతుందా... మరీ టూ మచ్ కాకపోతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు