మహేష్‌, చరణ్‌... ఇద్దరూ ఇద్దరే

మహేష్‌, చరణ్‌... ఇద్దరూ ఇద్దరే

నిజ జీవితంలో మంచి స్నేహితులు మాత్రమే కాకుండా తమ చిత్రాల నిర్మాణ వ్యవహారాలని పర్యవేక్షించే విషయంలోను మహేష్‌, చరణ్‌ ఒకే తీరు ఫాలో అవుతున్నారు. తమ చిత్రాలపై వంద కోట్ల బిజినెస్‌తో పాటు ఎంతో మంది బయ్యర్ల జీవితాలు ఆధారపడి వుండడంతో కేవలం రెమ్యూనరేషన్‌ తీసేసుకుని తమ పని చేసుకుపోవడం కాకుండా నిర్మాణ వ్యవహారాలతో పాటు బిజినెస్‌ మేటర్స్‌లోను ఇద్దరూ ఇన్‌వాల్వ్‌ అవుతున్నారు.

భరత్‌ అనే నేను, రంగస్థలం చిత్రాలకే కాకుండా ఇప్పుడు మహేష్‌, చరణ్‌ చేస్తోన్న చిత్రాలకి కూడా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. మహేష్‌, వంశీ పైడిపల్లి చిత్రానికి ముగ్గురు నిర్మాతలున్నా కానీ పూర్తిగా వారి మీదే అన్నీ నడిచేయడం లేదు. బిజినెస్‌, బడ్జెట్‌ తదితర అంశాలన్నీ మహేష్‌ కూడా పరిశీలిస్తున్నాడు. ఎంతకి అమ్మితే అందరికీ లాభదాయకంగా వుంటుందో చూసుకుని మరీ అంత ఖర్చు పెట్టిస్తున్నాడు. చరణ్‌ కూడా బోయపాటి సినిమాకి ఇదే చేస్తున్నాడు.

బోయపాటి లావిష్‌గా తీసే దర్శకుడైనప్పటికీ అతడి ఇష్టానికి ఖర్చు పెట్టనివ్వకుండా చరణ్‌ చూసుకుంటున్నాడు. స్టార్‌ హీరోలు ఇలా తమ పారితోషికం మాత్రమే కాకుండా నిర్మాత, బయ్యర్ల శ్రేయస్సుని కూడా చూసుకోవడం గొప్ప విషయమని, అందరు అగ్ర హీరోలు ఇలాగే వుంటే పరిశ్రమ బాగుంటుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English