ఇద్దరమ్మాయిలతో.. వచ్చేస్తోందోచ్‌

ఇద్దరమ్మాయిలతో.. వచ్చేస్తోందోచ్‌

చాలా రోజుల నుండి ఎప్పుడు విడుదలవతోందో తెలియకుండా మనల్ని సతమతపెడుతున్న ఇద్దరమ్మాయిలతో సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు నోచుకుంది. ఈ రోజు మధ్యాహ్నం సినిమా సెన్సార్‌ పనులు పూర్తవ్వడంతో, సినిమాను మే 31న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు నిర్మాతకు చెందిన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఇకపోతే సినిమాను తిలకించిన సెన్సార్‌ వారు, యు/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చారు. సినిమాలో కాస్త రొమాన్స్‌, కాస్త వయోలెన్స్‌ డోస్‌ ఎక్కువగా ఉండటంతో, ఈ సర్టిఫికేట్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ఎన్నడూ లేనంత స్టయిలిష్‌గా ఉంటే, నటీమణులు అమలా పాల్‌, క్యాథరీన్‌లు గ్లామర్‌ డిపార్ట్‌మెంట్‌లో మెరిసిపోతున్నారు.

ఇక పూరి డైలాగ్స్‌, డైరక్షన్‌, అలానే దేవిశ్రీప్రసాద్‌ సంగీతం గురించి మనం  చెప్పక్కర్లేదు. మొత్తానికి ఈసారైనా మిస్సవ్వకుండా సినిమా 31న ఖచ్చితంగా వచ్చేస్తే ఇక మెగా అభిమానులకు పండగే. ఇంకెందుకు లేటు, వెళ్ళి మీ టిక్కెట్‌ను బుక్‌ చేసుకోండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు