మూస మారుతి సైడ్‌ ఇన్‌కమ్‌

మూస మారుతి సైడ్‌ ఇన్‌కమ్‌

ఒకటే టెంప్లేట్‌లో కథలు రాసేసే దర్శకుడు మారుతి అడపాదడపా తన ఐడియాలని వేరే వాళ్లకి అమ్ముతున్నాడు. అతను కథ అందించిన 'బ్రాండ్‌ బాబు' చిత్రానికి గాను మారుతికి కోటి రూపాయలు గిట్టాయట. తన రొటీన్‌ పంథాలో రాసేసిన ఈ స్క్రిప్టుకి కూడా మారుతికి కోటి రూపాయలు వచ్చాయంటే అతని సైడ్‌ ఇన్‌కమ్‌ ఎంత ఘనంగా వుందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో బూతు కథలు రాసిన మారుతి ఆ తర్వాత స్టయిల్‌ మార్చాడు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా రిలేట్‌ చేసుకునే అంశాలని తీసుకుని కథలు రాస్తున్నాడు. ఇందువల్ల అతనికి పెద్ద హీరోల నుంచి పిలుపు రావడం లేదు. ఒకరిద్దరు స్టార్‌ హీరోలు పిలిచినా కానీ తన మార్కు ఆర్డినరీ స్క్రిప్టులే చెప్పాడట. దాంతో అతడిని మీడియం రేంజ్‌ సినిమాలకి పరిమితం చేసేసారు.

ఒకవైపు దర్శకుడిగా బిజీగా వుంటూనే తనకొచ్చిన చిన్నా చితకా ఐడియాలని కథలు చేసి అమ్మేస్తూ తీరిక సమయాన్ని కూడా కోట్లు చేసేసుకుంటున్నాడు. ఈ సైడ్‌ ఇన్‌కమ్‌ సంగతి ఇలా వుంటే 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాతో తన రేంజ్‌ పెరుగుతుందనే ధీమాని మారుతి సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు