నాని కంట్రోల్‌ తీసుకోక తప్పదు బాస్‌

నాని కంట్రోల్‌ తీసుకోక తప్పదు బాస్‌

బిగ్‌బాస్‌ షో మొదటి సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించడమే కాకుండా ఆ షోకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఎన్టీఆర్‌ స్వయంగా పర్యవేక్షించేవాడు. కంటెస్టెంట్స్‌ ఎవరు, వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎవరు వస్తారు లాంటివన్నీ తారక్‌కి తెలియకుండా జరిగేది కాదు. ఎలిమినేషన్స్‌, నామినేషన్స్‌ అన్నీ ట్రాన్స్‌పరెంట్‌గా వుండేట్టు జాగ్రత్త పడేవాడు. పది వారాల పాటు ఎలాంటి కాంట్రవర్సీ కానీ, నెగెటివ్‌ రిమార్క్‌ గానీ రాకుండా చూసుకున్నాడు.

ఈసారి హోస్ట్‌ నాని తన పనేదో తాను చూసుకోవడం మీదే దృష్టి పెడుతున్నాడు. కంటెస్టెంటులతో గట్టిగా మాట్లాడడం లేదనే విమర్శలకి మాత్రం బదులిస్తూ వారిని గట్టిగానే మందలిస్తున్నాడు. కాకపోతే షో నిర్వహణపై మాత్రం నాని కంట్రోల్‌ తీసుకోలేదు. దీంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఆడింది ఆటగా చెల్లిపోతోంది. హౌస్‌లో వున్న కొందరి పట్ల పక్షపాత ధోరణి చూపిస్తూ ఈ సీజన్‌ విమర్శల పాలవుతోంది.

నాని ఇలాంటి విషయాలని పట్టించుకోకపోవడంతో తేజస్వి, సమ్రాట్‌, తనీష్‌ తదితరుల్ని బిగ్‌బాస్‌ కాపాడుతోంది. ప్రతి వారం హౌస్‌లో జరుగుతోన్న లుకలుకలపై సీరియస్‌ అవుతోన్న నాని ఒకసారి తెరవెనుక జరుగుతోన్న భాగోతాన్ని గమనించి వాళ్లకీ క్లాస్‌ తీసుకోవాల్సి వుంది. లేదంటే బిగ్‌బాస్‌ నిర్వహణలోనే ఎన్నడూ లేని విధంగా తమకి అనుకూలంగా గేమ్‌ ఆడిస్తూ తెలుగు సీజన్‌ 2కి వస్తోన్న బ్యాడ్‌నేమ్‌లో కాస్త నాని కూడా మోయాల్సి వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు