దిల్‌ రాజు ఎన్టీఆర్‌కే ఎర్త్‌ పెట్టేసాడు

దిల్‌ రాజు ఎన్టీఆర్‌కే ఎర్త్‌ పెట్టేసాడు

చిన్న సినిమాలు తీస్తూ పండగలకి వచ్చే భారీ చిత్రాలకి పోటీగా తన చిత్రాలు విడుదల చేసే అలవాటున్న దిల్‌ రాజు ఈసారి ఎన్టీఆర్‌ సినిమాని టార్గెట్‌ చేసాడు. దసరాకి త్రివిక్రమ్‌, తారక్‌ల 'అరవింద సమేత వీర రాఘవ' విడుదల కానుందనేది తెలిసిందే. ఇంకా అధికారికంగా డేట్‌ ప్రకటించకపోయినా కానీ ట్రేడ్‌ సర్కిల్స్‌కి దసరా రిలీజ్‌ కన్‌ఫర్మ్‌ అని చెప్పేసారు. ఈ సంగతి తెలిసినా కానీ తన చిత్రాన్ని కూడా దసరాకి విడుదల చేస్తున్నట్టు దిల్‌ రాజు ప్రకటించాడు.

రామ్‌ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతోన్న 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రాన్ని దసరాకి రిలీజ్‌ చేస్తున్నాడు. ముందుగా డేట్‌ ప్రకటించాడు కనుక ఇక తనని వెనక్కి పొమ్మని ఎవరూ అడగలేరు. దసరా మిస్‌ అయితే మళ్లీ సంక్రాంతి వరకు స్లాట్‌ లేదు కనుక అరవింద సమేత కూడా వెనక్కి వెళ్లే అవకాశం లేదు. అజ్ఞాతవాసి నైజాం హక్కుల విషయంలో హారికా హాసిని, త్రివిక్రమ్‌లతో ఏర్పడిన పేచీ వల్లే దిల్‌ రాజు ఇలా తన సినిమాని పోటీగా విడుదల చేస్తున్నాడని ట్రేడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు.

మరి తారక్‌ పూనుకుంటే దిల్‌ రాజు ఏమైనా మెత్తబడి దీపావళికి వెళతాడో లేక దసరాకి ఎన్ని సినిమాలొచ్చినా వసూళ్లు వస్తాయని నచ్చచెప్పి తన పంతం నెగ్గించుకుంటాడో ఇప్పట్లో తేలదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు