చిరంజీవి అల్లుడికి చిన్న టార్గెట్టే

చిరంజీవి అల్లుడికి చిన్న టార్గెట్టే

చిరంజీవి అల్లుడు హీరో అయ్యాడు కదా అని బయ్యర్లు ఎగబడి 'విజేత' హక్కులు చేజిక్కించుకోలేదు. అలాగే అతడిని ఎక్కువ అంచనా వేసి నిర్మాత కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. విజేత చిత్రంపై అయిన ఖర్చుకి, జరిగిన బిజినెస్‌కి అయిదు కోట్ల షేర్‌ కనుక వసూలయితే బ్రేక్‌ ఈవెన్‌ అయిపోతుందట. కళ్యాణ్‌ దేవ్‌కి ఇది చాలా చిన్న టార్గెట్టే. మెగా హీరోల్లో అల్లు శిరీష్‌ కంటే కూడా కళ్యాణ్‌ దేవ్‌ చిత్రానికి తక్కువ పలికిందని స్పష్టమవుతోంది. మెగా ఫ్యామిలీకి లాయల్‌ ఫాన్‌ బేస్‌ వున్నా కానీ వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదరించేస్తారని లేదు.

అందుకే చిరంజీవి మాట మీదే 'విజేత' చిత్రాన్ని పొదుపుగా తీసారట. బయ్యర్లకి కూడా తక్కువ మొత్తాలకే అమ్మారట. చిరు అల్లుడనే ఫ్యాక్టర్‌ వర్కవుట్‌ అయితే అయిదు కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఈ చిత్రానికి పబ్లిసిటీ పరంగా కేర్‌ తీసుకోకపోవడం వల్ల రేపు రిలీజ్‌ అవుతుందనేది సరిగ్గా రిజిష్టర్‌ కూడా కాలేదు. సినిమా విడుదలై బాగుందనే టాక్‌ వస్తే ఒక్క వీకెండ్‌లో క్యాష్‌ చేసుకున్నా సేఫ్‌ అయిపోయే అవకాశాలున్నాయి కనుక బెంగ లేదు. కానీ విజేతకి ఎలాంటి టాక్‌ వస్తుందనేదే ఇప్పుడు ట్రేడ్‌ ఆసక్తిగా చూస్తోన్న అంశం. దీనికసలే ఈవారం ఆర్‌ఎక్స్‌ 100, చిన్నబాబు చిత్రాల నుంచి పోటీ కూడా వుందాయె.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English