సమంతను పెళ్లాడా.. లవర్‌గా ఎలా చేస్తా?

సమంతను పెళ్లాడా.. లవర్‌గా ఎలా చేస్తా?

కలిసి సినిమాల్లో నటించి.. ఆపై కలిసి జీవితాన్ని పంచుకున్న జంటలు మళ్లీ ఓ సినిమాలో కనిపించడం అరుదే. ఒకవేళ కలిసి నటించినా వయసు మీద పడ్డాక క్యారెక్టర్ రోల్స్ చేస్తుంటారు. అలా కాకుండా పెళ్లయిన హీరో హీరోయిన్లుగా సినిమా చేయడం మాత్రం చాలా చాలా అరుదు. అక్కినేని నాగచైతన్య-సమంత జోడీ ఈ అరుదైన జాబితాలోనే చేరబోతోంది. ‘నిన్ను కోరి ఫేమ్’ శివ నిర్వాణ దర్శకత్వంలో వీళ్లిద్దరూ కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమ పాత్రల గురించి ముందే చెప్పేశాడు చైతూ. వీళ్లిద్దరూ అందులో భార్యాభర్తలుగా కనిపించబోతున్నారట.

పెద్దగా ప్రేమకథేమీ చూపించకుండా నేరుగా ఇద్దరినీ భార్యాభర్తలుగానే చూపించబోతున్నాడట శివ. ఇందుకు కారణం వివరిస్తూ.. ‘‘పెళ్లయిన జంట కథ అది. ఇప్పటి వరకూ మేం ప్రేమకథలే చేశాం. ఈసారి భార్యాభర్తలుగా నటించబోతున్నాం. ఆ పాయింటే మకు కొత్తగా అనిపించింది. మా ఇద్దరికీ పెళ్లయిందని అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా నేను సమంతకు సైట్‌ కొట్టినట్టు నటిస్తే.. ఏం బాగుంటుంది?’’ అన్నాడు చైతూ. తన కెరీర్.. తాను చేసే సినిమాల విషయంలో సమంత సలహాలు తీసుకుంటూనే సాగుతానని చైతూ చెప్పాడు. ‘‘సమంత ఏం అనుకుంటే అది నిజాయతీగా చెప్పేస్తోంది. ఈ పోస్టర్‌ బాగోలేదు... ఈ టీజర్‌ బాగోలేదు.. అని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. కాబట్టి ఆమె సలహాలు తీసుకుంటూ సాగుతా’’ అని చైతూ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు