ఆర్ఎక్స్ 100.. దేవరకొండ సూటవ్వదన్నాడట

 ఆర్ఎక్స్ 100.. దేవరకొండ సూటవ్వదన్నాడట

టాలీవుడ్లో గత ఏడాది ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇదొక ట్రెండ్ సెట్టర్ అయింది. ఈ గురువారం విడుదల కాబోతున్న ‘ఆర్ఎక్స్ 100’ కూడా అలాంటి సినిమానే అవుతుందన్న అంచనాలున్నాయి. అందరూ కొత్త వాళ్లతో అజయ్ భూపతి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంపై ముందు ఏ అంచనాలూ లేవు. కానీ ఆసక్తికర పోస్టర్లు.. టీజర్.. ట్రైలర్‌తో ఈ చిత్రం ఆసక్తి రేకెత్తించగలిగింది. విడుదల దగ్గర పడేసరికి దీనిపై నెమ్మదిగా అంచనాలు పెరిగాయి.

ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే దీనిపై ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తి ఉందో అర్థమవుతుంది. ఐతే కార్తికేయ అనే కొత్త హీరో నటిస్తేనే ఇంత క్రేజ్ వచ్చిందంటే.. ‘అర్జున్ రెడ్డి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ ఇందులో నటిస్తే ఎలా ఉండేది?

నిజానికి ‘ఆర్ఎక్స్ 100’ కథను దర్శకుడు అజయ్ ముందుగా చెప్పింది విజయ్‌కేనట. ‘పెళ్లిచూపులు’ తర్వాత అతనీ కథ విన్నాడట. కానీ అప్పటికే 8అర్జున్ రెడ్డి’ కమిటైన విజయ్.. కొంత కాలం ఆగమన్నాడట. ‘అర్జున్ రెడ్డి’ అయ్యాక అజయ్ కలిస్తే.. ఆ సినిమాతో తన ఇమేజ్ మారిపోయిందని.. ఇప్పుడు తాను ఈ కథలో నటిస్తే బాగుండదని.. తనకు సూటవ్వదని.. ఎవరైనా కొత్త హీరోతోనే ఈ సినిమా చేయమని విజయ్ చెప్పాడట.

ఆ తర్వాత దర్శకుడు అజయ్ దగ్గరికి అనుకోకుండా కార్తికేయ ఫొటోలు వస్తే అవి చూసి నచ్చి.. అతడి వీడియోలు చూసి తన సినిమాకు ఎంచుకున్నాడట. ఈ విషయాన్ని కార్తికేయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇలా అదృష్టవశాత్తూ ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తన చేతికి వచ్చిందని.. ఇది తనకు గొప్ప అవకాశమని అతను చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు