మెగా సలహాలతో బాగా వచ్చింది

మెగా సలహాలతో బాగా వచ్చింది

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. చిరంజీవి చిన్నల్లుడు హీరోగా నటించిన ‘విజేత’ సినిమాతో రంగప్రవేశం చేస్తున్నాడు. సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ ప్రత్యేకంగా అల్లుడి ప్రతిభను బాగానే మెచ్చుకున్నాడు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై వస్తున్న విజేత మూవీని రాకేష్ శశి డైరెక్ట్ చేశాడు.

విజేత సినిమాకు చిరంజీవి నుంచి ఎలాంటి గైడెన్స్ ఉందో డైరెక్టర్ రాకేష్ శశి మూవీ ప్రమోషన్స్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ‘‘ఈ సినిమా కోసం కథ సిద్ధం చేసుకుని కొత్త హీరో కోసం ట్రయ్ చేస్తూ సత్యానంద్ మాస్టర్ ను కలిస్తే ఆయన కళ్యాణ్ దేవ్ పేరు చెప్పారు. అప్పుడే నాకు ఆయన మెగాస్టార్ అల్లుడని తెలిసింది. కళ్యాణ్ దేవ్ తో సినిమా తీద్దామని ఫిక్సయిన రెండు రోజులకు చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అప్పుడు ఆయనకు కొన్ని డైలాగులతో సహా కథ నెరేట్ చేశాను. ఇదంతా విని మెచ్చుకున్న మెగాస్టార్ కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. సినిమా బాగా రావడానికి ఈ సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి’’ అంటూ చిరు చేసిన పెద్ద సాయం గురించి చెప్పుకొచ్చాడు రాకేష్ శశి.

విజేత పక్కా మిడిల్ క్లాస్ అబ్బాయి కథ అని.. మధ్య తరగతి కుర్రాళ్లంతా తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా ఈ స్టోరీ ఉంటుందని అంటున్నాడు రాకేష్ శశి. కళ్యాణ్ దేవ్ పుట్టి పెరిగింది ధనవంతుల కుటుంబం కావడంతో దీనికోసం చాలానే గ్రౌండ్ వర్క్ చేశాడని చెప్పాడు. కళ్యాణ వైభోగమే ఫేమ్ మాళవిక నాయక్ విజేత మూవీలో హీరోయిన్ గా నటించింది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English