బిగ్ బాస్ లోకి కుమారి.. వస్తోందా?

బిగ్ బాస్ లోకి కుమారి.. వస్తోందా?

ఒక్కో వారం గడుస్తున్న కొద్దీ బిగ్ బాస్ సీజన్-2పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూ వస్తోంది. మొదట్లో కంటెస్టెంట్ల తీరు మొత్తం నీరసంగా.. చప్పగా సాగినా ఈమధ్య కాస్త తీరు మారింది. ఇప్పటివరకు హౌస్ లో ఉన్నవాళ్లలో గ్లామర్ పరంగా మేజర్ అట్రాక్షన్ తేజస్వి మాదివాడనే. ఆమె కూడా మాంచి హుషారుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇప్పుడు బిగ్ బాస్ -2 కు మరింత గ్లామర్ యాడ్ చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా ఓ పాపులర్ హీరోయిన్ ను దించేందుకు ప్రయత్నిస్తున్నారు. కుమారి 21ఎఫ్ సినిమాతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టేసిన హెబ్బా పటేల్ ను షోలోకి ఎంటర్ చేయాలన్నది నిర్వాహకుల ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమైన ఆమెను సంప్రదించి షోలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరారట. కానీ ఇంతవరకు హెబ్బా సైడ్ నుంచి రిప్లయ్ రాలేదు. దీనిపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్నాకే ఏ విషయమూ చెబుతానంటూ తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది.

హెబ్బా పటేల్ కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఒప్పుకుంటే షోకు గ్యారంటీగా కొత్త అట్రాక్షన్ వచ్చినట్టే. ప్రస్తుతం హెబ్బా పటేల్ చేతిలో సినిమాలు కూడా ఏమీ లేవు. డెయిరీ ఖాళీగానే ఉంది కాబట్టి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి సినిమాల పరంగా ఇబ్బంది ఏమీ ఉండదు. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దీక్షాపంత్ హౌజ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు హెబ్బా అడుగు పెడుతుందా.. వెయిట్ అండ్ సీ 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు