అంత ఆరాటమొద్దు మహరాజా

అంత ఆరాటమొద్దు మహరాజా

సినిమా మొదలుపెట్టిన తరవాత చకచకా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న టైంలో రిలీజ్ చేయగలిగితే చాలా మంచిది.  అనుకున్న టైంలో సినిమా పూర్తి చేస్తే నిర్మాతకు చాలా ఖర్చు కలిసొస్తుంది. అదే టైంలో సినిమా క్వాలిటీ గురించి పట్టించుకోకుండా థియేటర్లకు తీసుకొస్తే ఆనక నిర్మాతకు నష్టాలు లెక్కలు వేసుకోవడం తప్ప మిగిలేదేం ఉండదు.

రవితేజ ఇప్పుడు లెక్కలోకి తీసుకోవాల్సింది ఈ విషయాన్నే. సూపర్ ఫాస్టుగా సినిమాలు పూర్తి చేస్తూ వస్తున్న మాస్ మహారాజా తరవాత సినిమా అమర్ అక్బర్ ఆంటోని రిలీజ్ డేట్ ఫిక్సయిపోయిందని తెలుస్తోంది. ఈ మూవీని సెప్టెంబర్ 28 నాటికి థియేటర్లకు తెచ్చేలా మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోని షూటింగ్ ను కొద్ది రోజుల క్రితమే స్టార్ట్ చేశారు. అప్పుడే రిలీజ్ డేట్ చెప్పేస్తున్నారంటే షూటింగ్ ఎంత ఫాస్టుగా చేస్తున్నారో తెలిసిపోతుంది.

ఈ ఏడాది రవితేజ హీరోగా నటించిన టచ్ చేసి చూడు, నేలటిక్కెట్టు సినిమాలు రిలీజయ్యాయి. ఈ రెండూ ఘోరమైన ఫ్లాపులుగా మిగిలపోయాయి. నేలటిక్కెట్టు సినిమాను ఫాస్టుగా కంప్లీట్ చేశారు. అంతకన్నా డబుల్ ఫాస్టులో థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోని విషయంలోనూ ఇదే జోరు కనిపిస్తోంది. సినిమా అవుట్ పుట్ అనుకున్నట్టుగా వస్తుందో లేదో చూసుకోకుండా కంగారు పడితే ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టే ప్రమాదముంది. రవితేజా.. నిదానమే ప్రధానం


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు