సిఎం భరత్ గురించి మాట్టాడరే??

సిఎం భరత్ గురించి మాట్టాడరే??

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలారోజుల తరవాత ‘భరత్ అనే నేను’ మూవీతో హిట్ కొట్టాడు. మాటమీద నిలబడే యంగ్ అండ్ స్టయిలిష్ సీఎంగా అదరగొట్టేశాడు. ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టి ప్రొడ్యూసర్ డి.వి.వి.దానయ్యకు దాదాపు రూ.20 కోట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టింది. కానీ దానయ్య మాత్రం ఈ సినిమా కలెక్షన్ల గురించి ఎక్కడా పెద్దగా పాజిటివ్ గా మాట్లాడకపోవడం మమేష్ తోపాటు అతడి అభిమానులకు మింగుడు పడటం లేదు.

దీనికితోడు రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ భరత్ అనే నేను ఇవ్వలేదన్నది అభిమానుల కినుక. భరత్ అనే నేను సూపర్ హిట్ అయినా దానిని ఎలివేట్ చేసే ప్రయత్నం ఎక్కడా చేయలేదని వాళ్ల ఫీలింగ్.  డి.వి.వి.దానయ్య ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. చరణ్ గుడ్ లుక్స్ లో ఉండేందుకే భరత్ అనే నేను మూవీ సక్సెస్ గురించి ఎక్కడా మాట్లాడకుండా దానిని అండర్ ప్లే చేస్తున్నాడని టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.

దానయ్య ఇంతవరకు ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నింటిలో భరత్ అనే నేనుకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఓరకంగా ఇది మహేష్ స్టామినా ప్రూవ్ చేసిన చిత్రం. కానీ దానయ్య తరవాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా వచ్చే మల్టీస్టారర్ సినిమా నిర్మిస్తున్నాడు. ఇలా వరసగా మెగా కాంపౌండ్ లోనే సినిమాలు చేస్తుండటంతో  కావాలని మహేష్ కు అన్యాయం చేశాడని అభిమానులు బాధపడిపోతున్నారు. అంత లాభాలు వచ్చాక కూడా ఆ హిట్ కంటికి ఆనడం లేదా దానయ్యా? 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు