టాక్: అనుపమ అంత అప్ సెట్ అయిందా?

టాక్: అనుపమ అంత అప్ సెట్ అయిందా?

ఇండస్ట్రీలో సీనియర్లకు - జూనియర్లకు మధ్య భేధాభిప్రాయాలు రావడం సహజమే. ఒకోసారి అవి చిన్న ఇష్యూలా మారిపోతాయి. ఈమధ్య రామ్ హీరోగా నటిస్తున్న హలో గురూ ప్రేమ కోసమూ సెట్ లో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్  హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పై కోప్పడ్డాడని.. దాంతో అనుపమ తీవ్రంగా హర్ట్ అయిందని న్యూస్ వచ్చింది.

వెంటనే దీనికి చెప్పేలా వీళ్లిద్దరూ ఓ సెల్ఫీలో నవ్వుతూ ఫోజిచ్చి ఇష్యూకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు ప్రకాష్ రాజ్ మాటలకు అనుపమ చాలాఎమోషనల్ అయిపోయిందని... దానిని తట్టుకోలేక షాకై స్పృహ తప్పి పడిపోయిందని తెలిసింది. దాంతో సెట్లోని వారు వెంటనే ఆమె ఆసుప్రతికి తీసుకెళ్లారని.. ఈ కారణంగా మూడు రోజులు షూటింగ్ ఆగిపోయిందనేది ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. కానీ ఈ సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ఇదేమంత పెద్ద ఇష్యూ కాదనే అంటున్నాడు. ‘‘ఆ రోజు ప్రకాష్ రాజ్ సీన్ ఇంకా బెటర్ గా రావడానికి అనుపమకు సలహా ఇచ్చాడంతే. అదీ గాక ఆమె ఆ రోజు ఉదయం నుంచి డల్ గానే ఉంది. రెస్ట్ తీసుకోమన్నా షూట్ కు వచ్చింది. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుప్రతికి తీసుకెళ్లాం. కొద్దిసేపట్లోనే తిరిగి సెట్ కు వచ్చేసింది’’ అంటూ ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు నక్కిన త్రినాథరావు

ఈ ఇన్సిడెంట్ తరవాత కూడా వీళ్లిద్దరూ కలిసి కొన్ని సీన్లలో నటించారని.. ఎక్కడా ఎలాంటి ప్రాబ్లెం ఎదురు కాలేదని డైరెక్టర్ అంటున్నాడు. ఆ ఇష్యూను ఇద్దరూ లైట్ తీసుకున్నారని.. ఆ విషయం అందరికీ తెలియాలనే సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English