వంద కోట్లివ్వండి.. చెత్త సినిమాలు మానేస్తా

వంద కోట్లివ్వండి.. చెత్త సినిమాలు మానేస్తా

తాప్సీకి ఇప్పుడు హిందీ చిత్ర సీమలో ఒక గౌరవప్రదమైన స్థానం వచ్చింది. పింక్‌, నామ్‌ షబానా లాంటి చిత్రాలతో తనకంటూ ఒక సీరియస్‌ ఇమేజ్‌ తెచ్చుకుంది. దీంతో ఆమెకి కొన్ని మంచి సినిమాలు చేసే అవకాశం దక్కుతోంది. త్వరలో విడుదల కాబోతున్న తాప్సీ సినిమాలు ముల్క్‌, సూర్మా రెండూ కూడా ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి. బాలీవుడ్‌ మసాలాలకి, ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా తాప్సీ తనని తాను బాగా ఎస్టాబ్లిష్‌ చేసుకోగలిగింది.

అయితే మధ్యలో దిష్టి చుక్కలా జుడ్వా 2లో నటించింది. ఆ చిత్రంలో బికినీలు ధరించి ఎక్స్‌పోజింగ్‌ చేసిన తాప్సీని చాలా మంది 'ఇంత మంచి సినిమాలు చేస్తూ నీకు అది చేయాల్సిన అవసరం ఏమిటి' అని అడుగుతున్నారు. ఆ చిత్రానికి వంద కోట్లకి పైగా వసూళ్లు వచ్చాయని, దానిని చెత్త సినిమా అంటున్నారని అంత వసూలు చేసే సత్తా వున్న సినిమాని ఎలా వదులుకుంటానని తాప్సీ అడుగుతోంది.

తాను చేసే ముల్క్‌, పింక్‌లాంటి చిత్రాలకి వంద కోట్లకి పైగా వసూళ్లు ఇమ్మని, అప్పుడు తనకి జుడ్వాలాంటి చిత్రాలు చేయాల్సిన అవసరమే వుండదని నెపం ప్రేక్షకుల మీదకి నెట్టేస్తోంది. ట్రోల్స్‌ని హ్యాండిల్‌ చేయడంలో తాప్సీ రూటే వేరన్నట్టు వుంటుంది. కేవలం మంచి సినిమాలు ఎంచుకోవడమే కాకుండా సోషల్‌ మీడియా హ్యాండ్లింగ్‌లో కూడా తాప్సీ అదరగొట్టేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు