అన్ని వందల కోట్లకి ఇదేమి ముహూర్తం

అన్ని వందల కోట్లకి ఇదేమి ముహూర్తం

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రోబో సీక్వెల్‌ '2.0'కి ముహూర్తం ఖరారు చేసారు. వచ్చే యేడాది వరకు రాదని అభిమానులు ఫిక్స్‌ అయిపోయిన సినిమాని ఈ సంవత్సరమే విడుదల చేస్తున్నామని ప్రకటించారు. నిజానికి అభిమానులు ఆనందించాల్సిన వార్తే ఇది. కానీ ఆ రిలీజ్‌ డేట్‌ చూసి అందరూ అవాక్కవుతున్నారు. నవంబర్‌ 29 అంటే ఏ లాంగ్వేజ్‌లోను అడ్వాంటేజ్‌ వున్న డేట్‌ కాదు. తమిళంలో అతి పెద్ద సినిమా సీజన్‌ దీపావళి అయితే, తెలుగులో సంక్రాంతి పెద్ద సీజన్‌. హిందీలో రంజాన్‌, దీపావళి, క్రిస్మస్‌కి సినిమాలకి మంచి వసూళ్లు వస్తుంటాయి.

ఇవన్నీ కాకుండా సమ్మర్‌లో వస్తే ఇలాంటి భారీ బడ్జెట్‌ సినిమాలకి లాంగ్‌ రన్‌ వుంటుంది. ఇదంతా వదిలేసి నవంబర్‌ 29 లాంటి ఎలాంటి సెలవులు లేని టైమ్‌ని రిలీజ్‌ డేట్‌గా ఎందుకు ఫిక్స్‌ చేసుకున్నట్టు? దాదాపు అయిదు వందల కోట్లు వసూళ్లు రాబట్టాల్సిన చిత్రానికి ఇంత బ్యాడ్‌ డేట్‌ ఫిక్స్‌ చేస్తారా అని ఫాన్స్‌ గుస్సా అవుతున్నారు.

అయితే బయ్యర్ల నుంచి ఒత్తిడి తట్టుకోలేకే ఈ డేట్‌ అనౌన్స్‌ చేసారని, ఇందులో ఒక స్ట్రాటజీ కూడా వుందని, ఈ డేట్‌ కంటే మంచి డేట్‌ కావాలని వాళ్లే పట్టుబడతారు కనుక వాళ్ల మాట మీదే వాయిదా వేసినట్టు అవుతుందని, తద్వారా బయ్యర్లని సైలెన్స్‌ చేయవచ్చుననేది నిర్మాతల ఆలోచన అయి వుంటుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఇంత భారీ చిత్రానికి సరయిన రిలీజ్‌ ప్లానింగ్‌ లేకుండా పోవడం మాత్రం కడు విచారకరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు