సాయి ధరమ్‌ తేజ్‌కి కటింగ్‌ స్టార్టయింది

సాయి ధరమ్‌ తేజ్‌కి కటింగ్‌ స్టార్టయింది

వరుస వైఫల్యాలతో తన మార్కెట్‌ని అతలాకుతలం చేసుకున్న సాయి ధరమ్‌ తేజ్‌కి చేతికొచ్చిన సినిమాలు కూడా చేజారుతున్నాయి. ఇంటిలిజెంట్‌ తర్వాత వచ్చిన తేజ్‌ కూడా అదే దారి పట్టడంతో అతనితో సినిమా తీయడం ఆత్మహత్యాసదృశమే అని కొందరు నిర్మాతలు ఫీలవుతున్నారు. దీంతో ఓకే చేసుకున్న వాటి నుంచి కూడా తేజ్‌ తప్పుకోవాల్సి వస్తోంది.

చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో తేజ్‌ హీరోగా ఖరారైన చిత్రం ఇప్పుడు నాని చేతిలోకి పోయింది. మరో రెండు ప్రాజెక్టులు కూడా అతని చేతిలోంచి పోయాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. మిగతా సినిమాలన్నీ పోయినా 'చిత్రలహరి'ని మాత్రం తేజ్‌ చేజారనివ్వలేదు. కిషోర్‌ తిరుమల రూపొందించే ఈ చిత్రంపై తేజ్‌కి చాలా నమ్మకముంది. మధ్య తరగతి యువకుడిగా రిలేట్‌ చేసుకునే పాత్ర కావడంతో ఇది తన పరాజయాల పరంపరకి బ్రేక్‌ వస్తుందని అతను నమ్ముతున్నాడు.

అయితే చేతిలో వున్న సినిమాలన్నీ పోయి ఒక్కటే దానిపై ఆశలు పెట్టుకోవడం కూడా మంచి స్ట్రాటజీ కాదంటున్నారు విశ్లేషకులు. దీని ఫలితం అటు ఇటు అయితే తర్వాత మరో సినిమా దక్కించుకోవడం కూడా కష్టమవుతుందనేది వారి అభిప్రాయం. ఎఫర్ట్స్‌ అన్నీ దీని మీదే పెడితే తాడో పేడో తేలిపోతుందని భావిస్తూ ఎన్ని మిస్‌ అయిపోయినా బాధ పడడం లేదతను.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English