మహేష్‌కి నమ్రతలా చైకి సమంత!

మహేష్‌కి నమ్రతలా చైకి సమంత!

భర్తలు సంతకం చేసే సినిమాల విషయంలో కొందరు భార్యలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. మొహమాటాలకి పోయి సినిమాలు సైన్‌ చేస్తాడనే పేరున్న మహేష్‌ సినిమా వ్యవహారాలు నమ్రత చేతికి వచ్చిన తర్వాత అతనికి చాలా కలిసి వచ్చింది. తెలుగు హీరోల్లో మహేష్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అందనంత ఎత్తుకి చేరుకోవడంలోను నమ్రత పాత్ర చాలా వుంది. సినిమా ఫ్లాప్‌ అవగానే హీరోలని పారితోషికంలో కొంత వెనక్కి ఇమ్మనడం టాలీవుడ్‌లో తరచుగా జరిగేదే. కానీ నమ్రత మాత్రం హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా పేమెంట్‌ విషయంలో నిక్కచ్చిగా వుంటుందట.

టాప్‌ డైరెక్టర్లతో సినిమాలు క్యూలో పెట్టడం, ఎప్పుడూ క్రేజీ ప్రాజెక్టులు చేయించడంలో ఆమె ప్లానింగ్‌కి ఎక్కువ క్రెడిట్‌ ఇవ్వాలంటారు. త్వరలో నాగ చైతన్యకి కూడా సమంత ఈ విధంగా మారనుందట. స్టార్‌ స్టేటస్‌ తెచ్చుకోలేకపోయిన భర్తని టాప్‌ లీగ్‌లోకి చేర్చేందుకు సమంత రంగంలోకి దిగుతోందట. ఇకపై చైతన్య అంగీకరించే సినిమాలన్నీ వయా సమంత జరుగుతాయని, భర్త బిజీగా వున్నా కానీ స్టార్‌గా పెద్ద స్థాయికి వెళ్లకపోవడంతో ఇక నుంచి అతడి రేంజ్‌ పెంచే సినిమాలు ఓకే చేయించడానికి సమంత డిసైడయింది. ఇందుకోసం తన సినిమాలు తగ్గించుకుని మరీ చై కెరియర్‌పై సమంత దృష్టి పెడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు