నాన్నతో కష్టం.. కంటెంటే కాపాడాలి

నాన్నతో కష్టం.. కంటెంటే కాపాడాలి

టాలీవుడ్ లో పాపులర్ కమెడియన్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా నిలదొక్కుకునేందుకు ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాడు. ఓ సినిమా మొదలుపెట్టడం... నెమ్మదిగా బజ్ రావడం.. తీరా రిలీజయ్యాక అది కాస్తా తుస్సుమనడం.. ఈ హీరో కెరీర్ లో రెండు మూడుసార్లు రిపీటయ్యింది.

ఎప్పటిలాగే ఈసారి కూడా ఫ్లాప్ తరవాత బోలెడంత గ్యాప్ తీసుకుని మళ్లీ హీరోగా వెండితెరపై కనిపిస్తున్నాడు గౌతమ్. షార్ట్ ఫిలింలతో పేరు తెచ్చుకున్న ఫణీంద్ర నరిశెట్టి క్రౌడ్ ఫండింగ్ తో తీస్తున్న మను సినిమాలో గౌతమ్ హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమాను యూఎస్ బేస్ డ్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ నిర్వాణ సినిమా రిలీజ్ చేయబోతోంది. దీంతో విడుదల పరంగా మనుకు ఇబ్బందులు ఏవీ ఎదురయ్యే అవకాశం ఉండదు. కాకుంటే గౌతమ్ ఇంతకుముందు సినిమాలు రిలీజయిన టైంలో కమెడియన్ గా బ్రహ్మానందం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బ్రహ్మి క్యారెక్టర్ లేకపోతే సినిమా లేదు అన్న రేంజిలో పరిస్థితి ఉండేది. ఇప్పుడు టైం మారింది. బ్రహ్మానందం అస్సలు ఫామ్ లో లేడు. మూస పాత్రలతో ఇమేజ్ బాగా తగ్గిపోయింది. ఒకటో.. అరో సినిమాల్లో మాత్రమే ఆయన కనిపిస్తున్నాడు. మరి ఇలాంటప్పుడు ఈ సినిమాను స్వయంగా బ్రహ్మానందం ప్రమోట్ చేసినా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం కష్టం. మరి ఇలాంటప్పుడు గౌతమ్ ఎలా నెగ్గుకొస్తాడు అనేదే సందేహం.

అయితే నాన్నను కాకుండా ఇప్పుడైనా కంటెంట్ ను నమ్ముకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా మనోడు హిట్టుకొట్టేసే ఛాన్సుంది. మరి ఇప్పుడైనా ఆ పని చేస్తాడా? అంతే కాకుండా.. ఈ సినిమాతో ఇప్పటివరకు వెండితెరపై ఒక్క హిట్టు కూడా లేని యుట్యూబ్ బ్యూటి చాందిని చౌదరికి కూడా పెద్ద హిట్టే కావాలి. చూద్దాం ఏమవుతుందో!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు