ఈసారైనా హిట్టు కొట్టాలని ఆశిస్తూ!!

ఈసారైనా హిట్టు కొట్టాలని ఆశిస్తూ!!

ఈసారయినా హిట్ కొడతాడని మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే సాయి ధరమ్ తేజ్ వారిని బాగా నిరాశ పరిచాడు. యాక్షన్ అండ్ మాస్ ఎంటర్ టెయినర్లతో వరస ఎదురుదెబ్బలు తిన్న తేజు రూటు మార్చాడు. ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న కరుణాకరన్ డైరెక్షన్ లో తేజ్.. ఐలవ్ యూ సినిమా చేశాడు. తేజు కొత్తగా ట్రయ్ చేసినా సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది.

వరస ఫ్లాపులతో సాయి ధరమ్ తేజ్ కెరీర్ గండంలో పడింది. కమర్షియల్ సక్సెస్ అత్యంత అవసరమైన ఈ టైంలో తరవాత రాబోయే చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. నేను.. శైలజ ఫేం కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కోసం టాప్ టెక్నీషియన్స్ ను తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ దేవిశ్రీ  ప్రసాద్ అందించబోతున్నాడు. దీంతో పాటల వరకు ఢోకా లేనట్టే. సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ ఘట్టమనేనిని తీసుకున్నారు.  

దీంతోపాటు చిత్రలహరి సినిమాలో కమెడియన్ గా బ్యాక్ అయిన సునీల్ కూడా ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. దీనివల్ల కామెడీకి లోటుండదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్ టెయినర్ లో గురు ఫేం రితికా సింగ్.. హలో ఫేం కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈసారైనా హిట్టు కొడతాడని ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు