రూమర్: నీ దారి నీదే.. నా దారి నాదే

రూమర్: నీ దారి నీదే.. నా దారి నాదే

ప్రేమ కథలు అన్నీ సుఖాంతం కావు. ఆ మాటకొస్తే చాలా ప్రేమ కథలు సఫలం కావు. కొన్ని విషాదాంతాలుగా మిగిలిపోతే ఇంకొన్ని జస్ట్ జ్ఞాపకంగా ఉండిపోతాయి. సినిమా ఇండస్ట్రీలోని ప్రేమల్లో ఎక్కువ ఇదేరకం ప్రేమ కథలుంటాయి. మనసు ఇవ్వడం ఎంత వేగంగా జరిగిపోతుందో.. అది మార్చేసుకోవడమూ అంతే వేగంగా జరిగిపోతుంది.

టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో పరిస్థితి ఇదే. ప్రేమలో మునిగి తేలిన ఈ హీరో ప్రేమ అన్నది ఒక కల అంటూ విషాదగీతాలు పాడుకుంటున్నాడు. కెరీర్ లో పైకొస్తున్న టైంలో ఓ పేద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ తో కలిసి నటించాడు. వాళ్లిద్దరి జంట బాగుందని పేరొచ్చింది. దాంతోపాటు ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడని న్యూస్ కూడా వచ్చింది. ఆ అబ్బాయే ఒకడుగు ముందుకేసి ఇలాంటి న్యూస్ ను కాస్తంత ఉప్పందించేవాడు.

అబ్బాయి మహా ఇంట్రస్ట్ గా ఉన్నాడు.. అమ్మాయి కూడా కాదని ఏమీ అనడం లేదు కాబట్టి వాళ్లిద్దరి ప్రణయ గాథ రేపోమాపో ఫలించి పెళ్లిపీటల దాకా వెళ్తుందని చాలామంది భావించారు. ఇంతలోనే ఈ ప్రేమకథకు ఎండ్ కార్డ్ పడిపోయింది. ఏమయిందో ఏమో మీ లవ్ స్టోరీ ఏమయిందంటూ ఎవరైనా అడిగితే సదరు హీరో అందరిమీదా చిర్రుబుర్రులాడుతున్నాడు. రీల్ లైఫ్ లో లవ్ గురించి తప్ప రియల్ లైఫ్ లవ్ స్టోరీ మాటెత్తద్దని అనేస్తున్నాడు. చేసేదేం లేక నీ దారి నీదే.. నా దారి నాదే అనుకుంటూ కెరీర్ పై మళ్లీ ఫోకస్ పెంచాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు