సమంత చూపిన బాటలోనే..

సమంత చూపిన బాటలోనే..

హీరోయిన్లు పెళ్లి చేసుకున్నాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోడమో.. లేక కెరీర్ కు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీకి ఫుల్ టైం కేటాయించడమో చేసేవారు. ఈ ట్రెండ్ మారుతోంది. హీరోయిన్లు పెళ్లి చేసుకున్నాకా టాప్ పొజిషన్ లో కొనసాగడం సాధ్యమేనని టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పటికే ప్రూవ్ చేసింది. సమంత లాగే ఇప్పుడు టాలీవుడ్ లో ఇంకో హీరోయిన్ కూడా పెళ్లయ్యాక స్టార్ డం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

హీరో సుమంత్ తాజాగా నటించిన మళ్లీ రావా సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఆకాంక్ష సింగ్. మంచి ఫీల్ ఉన్న ఈ ప్రేమ కథలో ఆకాంక్ష నటన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దీంతో ఆమెకు తొందరలోనే ఇంకో ఛాన్స్ వచ్చింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో నాని - నాగార్జున కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ దేవదాసు లో నాగ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఆకాంక్షకు దక్కింది. ఈమె ఫస్ట్ సినిమా మళ్లీ రావాలో నటించడానికి ముందే పెళ్లి చేసుకుంది. ఓవైపు మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే గ్లామర్ ఫీల్డ్ లోనూ గుర్తింపు తెచ్చుకుంది.

దేవదాస్ సినిమాలో ఆకాంక్ష నటన అందరినీ మెప్పించగలిగితే ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. ప్రస్తుతం హిందీ సీరియళ్లలో చేస్తున్న చాలామంది బ్యూటీలు అవకాశాల కోసం టాలీవుడ్ వైపు చూస్తున్నారు. వీళ్లలో కొందరు పెళ్లయినవాళ్లు ఉన్నారు. ఆకాంక్ష కూడా సమంతలా సక్సెస్ అయితే మరింత మంది మిస్సెస్ లు టాలీవుడ్ హీరోయిన్లుగా కనిపించే అవకాశం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు