స్టయిలిష్ విలన్ సంప్రదాయబద్దంగా..

స్టయిలిష్ విలన్ సంప్రదాయబద్దంగా..

కెరీర్ లో కొత్త తరహా క్యారెక్టర్లు చేయాలని.. ఇంతకు ముందెప్పుడూ కనిపించని లుక్ లో కనిపించాలని టాలీవుడ్ హీరోలంతా ట్రయ్ చేస్తున్నారు. అలాంటి కథలు దొరకడం లేదని చాలామంది బాధ పడిపోతున్నారు. కానీ ఒకే తరహా విలన్ పాత్రలు చేసుకుంటూ పోతున్న కబీర్ దుహాన్ సింగ్ ను ఓ కొత్త తరహా పాత్ర వెతుక్కుంటూ వచ్చింది.

గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాలో స్టయిలిష్ మాఫియా డాన్ గా కనిపించి బాగానే ఇంప్రెస్ చేశాడు కబీర్. ఆ తరవాత ఎక్కువ అలాంటి క్యారెక్టర్లే చేశాడు. ఇంతవరకు సూటు బూటు లో విలన్ గానే కనిపించిన ఇతడు తాజాగా సంప్రదాయబద్ధమైన బ్యాడ్ బాయ్ గా కనిపించబోతున్నాడు. తెలుగులో హర్రర్ సినిమాల సిరీస్ స్పెషలిస్టుగా పేరుతెచ్చుకున్న రాఘవ లారెన్స్ తరవాత చేయబోయే కాంచన-3లో కబీర్ చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో పంచెకట్టు.. నుదుటబొట్టు.. మెళ్లో రుద్రాక్షలతో కనిపించబోతున్నాడు. తన పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నాడు.

సౌత్ లో ఇప్పుడు స్టయిలిష్ విలన్లకు డిమాండ్ బాగానే ఉంది. ఇప్పటికే తెలుగులో బిజీగా ఉన్న కబీర్ కు తమిళం - కన్నడం నుంచి కూడా బోలెడు ఆఫర్లు వస్తున్నాయి. సిద్ధార్ధ్ హీరోగా నటించే ఓ తమిళ్ మూవీలో విలన్ గా చేస్తున్నాడు. దీంతోపాటు ఓ రెండు కన్నడ సినిమాల్లోనూ తన విలనిజం చూపిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English