చిరు సినిమాలో నటిస్తుంటే బాధా?

చిరు సినిమాలో నటిస్తుంటే బాధా?

మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేయడం కోసం ఎంతమంది కలలు కంటారో? దాన్నో పెద్ద అచీవ్మెంట్‌గా.. మరపురాని అనుభవంగా భావిస్తారు. ఐతే కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మాత్రం చిరుతో నటిస్తున్నందుకు బాధ పడుతున్నాడట. ఈ విషయంలో వివరణ ఇవ్వలేదు కానీ.. తాను బాధపడుతున్న మాట మాత్రం వాస్తవం అన్నాడు.

చిరు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో సుదీప్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టైంలోనే వెల్లడించారు. గత ఏడాదే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లగా.. తాజాగా సుదీప్ టీంతో కలిశాడు. అతడున్న సన్నివేశాల చిత్రీకరణ మొదలైంది. ఈ సందర్భంగా చాలా ఉద్వేగంగా ఒక మెసేజ్ పెట్టాడు సుదీప్.

తనకు సినిమా అనేది ఎప్పటికప్పుడు సర్ప్రైజ్‌లు ఇస్తూనే ఉందని.. ఇప్పుడు అలాంటి సర్ప్రైజే మరొకటి వచ్చిందని.. లెజెండ్ చిరంజీవి సార్‌తో ‘సైరా’లో స్క్రీన్ పంచుకునే అవకాశం దక్కిందని..  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పని చేయబోతున్నానని.. తన జీవితంలో ఇదే తొలి చారిత్రక సినిమా అని ట్వీట్ చేశాడు సుదీప్. అంతా అయ్యాక తనకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉందని చెబుతూ.. అలాగే ఆందోళనగా కూడా ఉందని అన్నాడు సుదీప్. మరి ఆ ఆందోళనకు కారణమేంటో చెప్పలేదు. బహుశా చిరుతో నటించే విషయంలో సుదీప్ ఒత్తిడికి గురవుతున్నాడేమో.

ఐతే తెలుగులో చేసిన తొలి సినిమా ‘ఈగ’తోనే మెస్మరైజ్ చేసిన సుదీప్.. ‘సైరా’లో కూడా అదరగొట్టేస్తాడని భావిస్తున్నారు. ‘ఈగ’ తర్వాత అంతగా ప్రాధాన్యం లేదని రెండు మూడు పాత్రల్లో కనిపించి మాయమైపోయిన సుదీప్.. ‘సైరా’తో మళ్లీ తనదైన ముద్ర వేస్తాడని అనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు