మోహన్ లాల్ పాత్రకు హృతిక్ నో

మోహన్ లాల్ పాత్రకు హృతిక్ నో

బాలీవుడ్లో సంజయ్ లీలా బన్సాలీ రూటే సెపరేటు. ఆయన తన స్వీయ దర్శకత్వంలో క్లాసిక్స్ అనిపించే సినిమాలు తీస్తుంటారు. ఆయన ప్రతి సినిమా ఆర్టిస్టిగ్‌గా ఉంటుంది. ‘హమ్ దిల్ కే చుకే సనమ్’.. ‘దేవదాస్’.. ‘బాజీరావ్ మస్తానీ’.. ‘పద్మావత్’.. ఇలా దేనికదే ప్రత్యేకమైన సినిమా. ఐతే దర్శకుడిగా ఇలాంటి కళాత్మకమైన సినిమాలు తీసే బన్సాలీ.. నిర్మాతగా మాత్రం మంచి మసాలా సినిమాలు ట్రై చేస్తుంటాడు.

అక్షయ్ కుమార్ నటించిన ‘రౌడీ రాథోడ్’ అందుకు ఓ ఉదాహరణ. దక్షిణాదిన సూపర్ హిట్టయిన ఇలాంటి మసాలా సినిమాల్ని ఏరికోరి బన్సాలీ వేరే దర్శకులతో పునర్నిర్మిస్తుంటాడు. మన క్రిష్‌తోనూ ఇలాగే ‘ఠాగూర్’ సినిమాను ‘గబ్బర్’గా రీమేక్ చేయించాడు. తాజాగా ఆయన కన్ను ఓ మలయాళ సినిమాపై పడిందట.

మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘పులి మురుగన్’ను హిందీలో బన్సాలీ పునర్నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం మలయాళ సినీ చరిత్రలోనే అతి పెద్ద హిట్టుగా నిలిచింది. అక్కడ రూ.100 కోట్ల వసూళ్ల మార్కును దాటిన తొలి చిత్రమదే. తెలుగులోనూ ‘మన్యం పులి’గా విడుదలై బాగా ఆడింది. ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చి తీయిద్దామనుకుంటున్నాడు బన్సాలీ. యూనివర్శల్ కథాంశం కావడంతో అక్కడి వాళ్లకూ నచ్చుతుందని భావిస్తున్నాడు. ఈ సినిమాకు హృతిక్ రోషన్ అయితే బాగుంటాడని బన్సాలీ ఫిక్సయ్యాడట. కానీ ఆ పాత్ర కోసం అడిగితే హృతిక్ నో అనేశాడట. అందుకు కారణాలేంటో తెలియలేదు.

హృతిక్ హీరోగా బన్సాలీ ‘గుజారిష్’ అనే సినిమా తీశాడు. ఆ సినిమా హృతిక్‌కు మంచి పేరు తెచ్చింది కానీ.. కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఇంతకీ ‘మన్యం పులి’ రీమేక్‌కు హృతిక్ ఎందుకు నో చెప్పాడో? అతను కాదనే సరికి రణ్వీర్ సింగ్‌ను ట్రై చేద్దామని బన్సాలీ అనుకుంటున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు