విశాల్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు

విశాల్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన ‘ఇరుంబు తిరై’ (తెలుగులో అభిమ‌న్యుడు) సినిమాతో త‌న కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు విశాల్. స‌మ్మె కార‌ణంగా స్లంప్‌లో ప‌డ్డ కోలీవుడ్‌కు మ‌ళ్లీ ఊపు తెచ్చింది ఈ చిత్ర‌మే. ఇది తెలుగులోనూ మంచి ఫ‌లితాన్నందుకుంది. ఈ సినిమాతో పాటుగా విశాల్ మ‌రో సినిమాలోనూ న‌టించాడు. అది కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ద‌శాబ్దంన్న‌ర కింద‌ట వ‌చ్చిన‘సెండైకోళి’ (పందెం కోడి)కి అది సీక్వెల్ కావ‌డం విశేషం. ఇప్ప‌టికే ఈ చిత్ర ట్రైల‌ర్ కూడా విడుద‌లైంది. కానీ రిలీజ్ మాత్రం కొంచెం లేటుగా చేయ‌బోతున్నారు. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌రు 18న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

పెద్ద స్టార్ల లీగ్‌లోకి చేరిపోయిన విశాల్ ఆషామాషీ డేట్లో త‌న సినిమా రిలీజ్ కావాల‌నుకోవ‌ట్లేదు. విజ‌య్, సూర్య లాంటి బ‌డా స్టార్ల‌తో దీపావ‌ళి పోరులో నిల‌వ‌బోతున్నాడ‌త‌ను. త‌మిళంలో ఇప్పుడు ఏ సినిమా విడుద‌ల కావాల‌న్నా త‌మిళ నిర్మాత‌ల మండ‌లి ఆధ్వ‌ర్యంలోని రిలీజ్ రెగ్యులేష‌న్ క‌మిటీ అనుమ‌తి సంపాదించాలి. ‘సెండైకోళి-2’కు ఆ అనుమ‌తి వ‌చ్చేసింది. ఈ రోజే నిర్మాత‌ల మండ‌లి అక్ట‌బోరు 18న రిలీజ్ చేసుకోవ‌చ్చ‌ని చెబుతూ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. ‘సెండైకోళి’తో విశాల్ కెరీర్‌ను మార్చేసిన లింగుస్వామినే సీక్వెల్‌కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అత‌డితో క‌లిసి విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. విశాల్ స‌ర‌స‌న కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించిందీ చిత్రంలో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు